OG And Devara: మన టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా అంటున్నారు. కానీ కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్ లో రావడం లేదు. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ఎన్టీఆర్(Junior NTR) వంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల సినిమాలు కూడా మొదటి రోజు వచ్చిన వసూళ్లకు, క్లోజింగ్ లో వచ్చే వసూళ్లకు అసలు పొంతనే ఉండడం లేదు. ఉదాహరణకు గత ఏడాది విడుదలైన ‘దేవర’ చిత్రాన్ని తీసుకుందాం. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 150 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రేంజ్ ఓపెనింగ్ వచ్చే సినిమాకు కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి, కానీ వచ్చిన వసూళ్లు కేవలం 380 కోట్ల రూపాయిలు మాత్రమే. అసలు గ్రాస్ కి క్లోజింగ్ కి సంబంధమే లేదు.
ఆ 380 కోట్లలో ఒక 80 కోట్ల రూపాయిలు హిందీ నుండి వచ్చాయి. ఇక ఈ ఏడాది భారీ అంచనాల విడుదలైన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి కూడా మొదటి రోజు 154 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం తెలుగు వెర్షన్ నుండి ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం అనేది హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు. ఈ రేంజ్ ఓపెనింగ్ వచ్చిన వసూళ్లకు కచ్చితంగా వెయ్యి కోట్లు ఆశించడం సహజమే. కానీ కేవలం 320 కోట్ల వద్ద లాంగ్ రన్ ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చిన ఓపెనింగ్ కి, క్లోజింగ్ కి వచ్చిన ఓపెనింగ్ కి ఏమన్నా సంబంధం ఉందా?. ఈ రెండు సినిమాలు వెయ్యి కోట్ల గ్రాస్ వరకు వెళ్లకపోవడానికి కారణం ఒక్కటే, సినిమా కంటెంట్ ఆ రేంజ్ లో లేకపోవడమే. ఈ చిత్రం అభిమానులకు సంతృప్తి పడే రేంజ్ లో ఉన్నప్పటికీ ఆడియన్స్ అందరికి నచ్చలేదని, అందుకే 400 కోట్లు లోపలే క్లోజింగ్ పడబోతోంది.
మరోపక్క ఎన్టీఆర్ దేవర చిరానికి కూడా ఇదే పరిస్థితి. ఈ చిత్రం నందమూరి అభిమానులకు తప్ప, మిగిలిన ఆడియన్స్ కి యావరేజ్ లాగా అనిపించింది. అందుకే పెద్ద రేంజ్ కి లాంగ్ రన్ లో వెళ్లలేకపోయింది. అటు ఓజీ చిత్రానికి కానీ, ఇటు దేవర చిత్రానికి కానీ ఆ రేంజ్ ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణం హీరోలే. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లకు ఉన్న విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ కారణంగానే ఈ రెండు చిత్రాలు ఓపెనింగ్స్ నుండి క్లోజుంగ్ వరకు ఆ మాత్రం అయినా వచ్చాయి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.