OG and Akhanda 2 Same Day Release : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మధ్య నువ్వా నేనా అనే తరహా లో పోటీ పడక తప్పే పరిస్థితి కనిపించడం లేదా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ'(They Call Him OG) ,బాలయ్య బాబు నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రాలు రెండు కూడా ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ని సెప్టెంబర్ 25 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. నిన్నటితో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. మరోసారి ఈ చిత్రం సెప్టెంబర్ 25 న వస్తుందని మేకర్స్ నిన్న కూడా గుర్తు చేశారు. అయితే ‘అఖండ 2’ కి షూటింగ్ మొదలయ్యే రోజునే సెప్టెంబర్ 25 న విడుదల అవుతుందని ప్రకటించారు. ఇది నామమాత్రం గా ప్రకటించిన విడుదల తేదీ, విడుదల అయ్యే సమస్యే లేదు, సంక్రాంతికి వస్తుందని అందరూ అనుకున్నారు.
Also Read : ధూమ్ 4′ లో సూపర్ స్టార్ మహేష్ బాబు..? డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కానీ ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉందని, కచ్చితంగా సెప్టెంబర్ 25 న విడుదల అవుతుందని మేకర్స్ మరోసారి ఖరారు చేశారట. రేపు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ లో విడుదల తేదీని ప్రకటిస్తారట. ఒకవేళ సెప్టెంబర్ 25 న ప్రకటిస్తే మాత్రం సోషల్ మీడియా లో ప్రతీ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు నందమూరి ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ తప్పవు. కూటమి గా అంతా కలిసి ఒకే పార్టీ గా ఉంటున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడమంటే కయ్యానికి కాలు దువ్వినట్టే. వాస్తవానికి ఈ వ్యవహారం లో కచ్చితంగా తప్పు ‘ఓజీ’ టీం వైపే ఉంది. ఎందుకంటే ‘అఖండ 2 ‘ కోసం రిజర్వ్ చేసుకున్న డేట్ లో తమ సినిమాని వేసుకోవాలి అనుకున్నప్పుడు ‘అఖండ 2’ టీం ని సంప్రదించాలి.
కానీ ఓజీ టీం అది చేయలేదు. మేము వస్తున్నాము, ఎవరు ఆ డేట్ లో ఉన్నా అడ్డు తప్పుకోవాల్సిందే అనే యాటిట్యూడ్ తో విడుదల తేదీని ప్రకటించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవుతాయా అంటే కచ్చితంగా అవ్వవు, ఎదో ఒక సినిమా అక్టోబర్ కి, లేదా నవంబర్ కి షిఫ్ట్ అవుతుంది. ‘అఖండ 2 ‘ టీం మొండిపట్టు పడితే ఓజీ టీం వెనక్కి వెళ్లక తప్పదు. ఎందుకంటే ఆ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు, ఇండస్ట్రీ లోనే కనీవినీ ఎరుగని భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం. కేవలం ఒక్క నైజాం ప్రాంతంలోనే 90 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. భారీ బిజినెస్ కాబట్టి వేరే సోలో రిలీజ్ డేట్ ని చూసుకోవాలి. కానీ నూటికి నోరు శాతం ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25 న వస్తుందని, ‘అఖండ 2’ అక్టోబర్ లో వస్తుందని అంటున్నారు. ఎందుకంటే ‘అఖండ 2’ కి ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదు,మరోపక్క ఓజీ ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యి సంవత్సరం దాటింది.