OG Advance Bookings: మరి కొద్దీ గంటల్లోనే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ క్రేజీ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని ఈ చిత్రం బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతుంది కాబట్టి. ట్రేడ్ పండితులు అందిస్తున్న గణాంకాల ప్రకారం, అదే విధంగా ఇప్పటి వరకు జరిగిన ఆన్లైన్ టికెట్ సేల్స్ ప్రకారం ఈ చిత్రానికి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇప్పటి వరకు కేవలం మన టాలీవుడ్ నుండి #RRR మరియు ‘పుష్ప 2’ చిత్రాలు మాత్రమే ఈ అరుదైన రికార్డు ని నెలకొల్పాయి. ఇప్పుడు ఆ జాబితా లోకి ఓజీ చిత్రం కూడా చేరింది.
ఓవర్సీస్ ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 3.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. అందులో కేవలం నార్త్ అమెరికా నుండి 2.6 మిలియన్ డాలర్లు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి రెండున్నర మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇది ఆల్ టైం టాప్ 3 ప్రీ సేల్స్ గా పరిగణించొచ్చు. #RRR మరియు కల్కి చిత్రాలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 2.7 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. కంటెంట్ డెలివరీ విషయం లో జాప్యం జరగకపోయుంటే ఓజీ చిత్రానికి కేవలం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండే 3 మిలియన్ డాలర్ల గ్రాస్ ప్రీ సేల్స్ నుండి వచ్చేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ టాక్ వస్తే ఫైనల్ ప్రీమియర్స్ గ్రాస్ కచ్చితంగా ఆల్ టైం రికార్డు గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది అనేది మరి కాసేపట్లో తేలనుంది.
ఇక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విషయానికి వస్తే, ఆంధ్ర ప్రాంతం నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, తెలంగాణ ప్రాంతం నుండి పాతిక కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలా ఓవర్సీస్ నుండి 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, తెలుగు రాష్ట్రాల నుండి 55 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, కర్ణాటక, చెన్నై మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి మరో వంద కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇంకా 5 గంటల సమయం ఉంది కాబట్టి ఈ గ్రాస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, చూడాలి మరి ఏ రేంజ్ కి వెళ్లబోతుంది అనేది.