OG 2 Week Collection: నిన్న గాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him O?G) చిత్రమొచ్చి అప్పుడే 2 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా మేనియా ని పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా అంత తేలికగా మర్చిపోలేరు. సినిమా విడుదలకు ముందు నుండే ఒక సెన్సేషనల్ యుఫోరియా ని నమోదు చేసింది ఈ చిత్రం. ప్రీమియర్స్ షోస్ నుండి ఆల్ టైం రికార్డ్స్ ని నమోదు చేసుకుంటూ వచ్చిన ఈ సినిమా, మొదటి రోజు ప్రీమియర్స్ తో కలిపి 154 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సింగల్ లాంగ్వేజ్ నుండి ఈ రేంజ్ వసూళ్లు ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ సినిమా కూడా రాబట్టలేదు. పవన్ కళ్యాణ్ స్టామినా మొత్తాన్ని ఈ జనరేషన్ కళ్లారా చూసినట్టు అయ్యింది. అదే జోరు ని లాంగ్ రన్ లో కూడా కనబరుస్తూ వచ్చిన ఈ సినిమా 2 వారాల్లో ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం లో రెండు వారాలకు కలిపి 51 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ నుండి వచ్చిన సమాచారం. అదే విధంగా సీడెడ్ ప్రాంతం 17 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కోసం నైజాం నుండి 4 కోట్లు, సీడెడ్ నుండి 4 కోట్ల 50 లక్షల రూపాయిలు రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ చిత్రానికి రెండు వారాలకు కలిపి 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి. ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఈస్ట్ గోదావరి జిల్లా నుండి 12 కోట్ల 4 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని 4 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వారాలకు కలిపి 8 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఈ ప్రాంతంలో 87 లక్షలు రాబట్టాల్సి ఉంటుంది. అదే విధంగా గుంటూరు చిత్రం లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా కోటి 74 లక్షలు రాబట్టాలి. ఇక కృష్ణా జిల్లాలో 9 కోట్ల 50 లక్షలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి రెండు వారాల్లో 9 కోట్ల 53 లక్షలు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో 4 కోట్ల 63 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, వరల్డ్ వైడ్ గా 176 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.