OG 2 Movie: పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ 2’ అప్డేట్ కారణంగా , మళ్లీ ఫుల్ యాక్టీవ్ మోడ్ లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మేనియా నే కనిపిస్తోంది. ‘ఓజీ’ పేరు తీస్తే చాలు , అభిమానులు మొత్తం పూనకాలొచ్చి ఊగిపోతుంటారు. సరైన సమయం లో , సరైన బ్లాక్ బస్టర్ తగలడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘటనలు జరిగినప్పుడు అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. ఇలాంటి అనుభవాలను పవన్ కళ్యాణ్ తన అభిమానులకు అందించడం లో దిట్ట. అలా ‘ఓజీ’ చిత్రం తో అలాంటి అరుదైన అనుభవాన్ని అందించాడు అభిమానులకు. అందుకే ‘ఓజీ 2’ పై ప్రేక్షకుల్లో ఈ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ‘ఓజీ’ క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశం , సీక్వెల్ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ని పెంచాయి.
ఇకపోతే ‘ఓజీ 2’ చిత్రాన్ని స్వయంగా పవన్ కళ్యాణే నిర్మించబోతున్నాడు. పలు సంస్థలు నిర్మాణం లో భాగస్వామ్యం పంచుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ , ప్రస్తుతానికి అయితే ఏది ఖరారు అవ్వలేదు. ఈ ఏడాది నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టడానికి అన్ని విధాలుగా రెడీ అవుతున్నాడు డైరెక్టర్ సుజీత్. ఈ మేరకు ఆయన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశాడు. ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన శ్రద్ద కపూర్ ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. గతం లో ఈమె ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సాహూ’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్రాండ్ గా మారిపోయింది. యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకుంది.
ఈమె ‘ఓజీ 2’ లో నటిస్తే బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం పై క్రేజ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ కి , ఈమె డేట్స్ సింక్ అవుతాయా లేదా అనేది ఒక్కటే చూడాలి. ఇందులో ఈమె ఓజాస్ గంభీర్ కి తల్లి పాత్రలో కనిపించబోతుంది. ఈమె ఫ్లాష్ బ్యాక్ మొత్తం జపాన్ లోనే ఉంటుంది. ఈమె షెడ్యూల్స్ ఇండియా లో జరిగే అవకాశాలే లేవట. పవన్ కళ్యాణ్ ఈసారి ఫారిన్ షెడ్యూల్స్ కి భారీగానే డేట్స్ ని కేటాయించినట్టు తెలుస్తోంది. మరో నెలరోజుల్లో హీరోయిన్ కి సంబంధించిన అధికారిక అప్డేట్ ని ప్రకటించబోతున్నారట మేకర్స్.
