Pushpa OTT Release: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ధ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ 300 కోట్ల కలెక్షన్లను దాటేసి విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్.. నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అయితే ఈ సినిమా రిలీజ్ అయి 20 రోజులు కూడా అవ్వకముందే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై వార్తలు వస్తున్నాయి. తాజాగా పుష్ప చిత్రయూనిట్ ఆడియన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.

Also Read: సూపర్ స్టార్ మహేష్ బాబుకి “థాంక్ యూ” చెప్పిన ఐకాన్ స్టార్… ఎందుకంటే ?
ఈనెల 7న పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం సినీ పరిశ్రమపై మరోసారి ఓమిక్రాన్ దెబ్బ పడింది. సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలకు ఓమిక్రాన్, కరోనా గట్టిగానే దెబ్బతీసింది. దీంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సిన తేదీనే పుష్ప సినిమా… ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా నెట్టింట్లో టాక్ నడుస్తోంది.
He’ll fight. He’ll run. He’ll jump. But he won’t succumb! 💥
Watch #PushpaOnPrime, Jan. 7
In Telugu, Tamil, Malayalam and Kannada@alluarjun #FahadhFaasil @iamRashmika@Dhananjayaka #Suneel #AjayGhosh #RaoRamesh @OG_Jagadeesh @ShatruActor @anusuyakhasba #Sritej #MimeGopi pic.twitter.com/lVxoE7DJSs— prime video IN (@PrimeVideoIN) January 5, 2022
ఇక ఇప్పుడు తాజాగా ఈ వార్తలనే నిజం చేస్తూ అఫిషియల్ గా ప్రకటించారు. కొంతమంది బన్నీ అభిమానులు మాత్రం సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే స్టార్ హీరో సినిమా, భారీ విజయం సాధించిన సినిమా ఎందుకు ఓటీటీకి అని ప్రశ్నిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అయినా కూడా ఓటీటీ నుంచి మంచి ఆఫర్ రావడంతో చిత్ర యూనిట్ దీనికి ఒప్పుకున్నట్టు సమాచారం. జనవరి 7న రాత్రి 8 గంటల నుంచి ‘పుష్ప’ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
Also Read: ‘పుష్ప’ 18వ రోజుకు బ్రేక్ ఈవెన్.. ఆల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే !