O Romeo: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గత కొంతకాలంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. రీసెంట్ గా రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో బాలీవుడ్ మరోసారి ఊపిరి పిలుచుకుంటుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం షాహిద్ కపూర్ సైతం ‘ఓ రోమియో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసినప్పటి నుంచే ఈ సినిమా మీద హైప్ విపరీతంగా పెరిగిపోయింది.
అనిమల్ సినిమాలనే ఇందులో కూడా బీభత్సమైన రక్తపాతాన్ని సృష్టించే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అనే విషయం అయితే మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా మీద ఒకప్పటి గ్యాంగ్ స్టార్ అయిన హుస్సేన్ ఉస్తారా కుమార్తె సనోబార్ షేక్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించింది…
ఈ సినిమా తన ఫాదర్ అయిన హుస్సేన్ ఉస్తారా కథ ఆధారంగా తెరకెక్కుతుందని చెప్పింది. అలాగే 1980 ఒక సంవత్సరంలో ముంబై అండర్ డాన్ గా హుస్సేన్ ఉస్తారా కి గొడవలు అయితే జరిగేవి…హుస్సేన్ ఉస్తారా vs సప్నా దీదీ మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగేది… వాళ్ళిద్దరి స్టోరీ నే ఇప్పుడు సినిమాగా చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇక వెంటనే సినిమాని ఆపేయాలి అంటూ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా, డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ లకు నోటీసులు పంపించింది.
ఇక ఈ విషయం మీద ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇద్దరు కోర్టుకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమాలో షాహిద్ కపూర్ త్రిప్తి డిమ్రీ తో పాటు మరి కొంతమంది నటీనటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాని ఫిబ్రవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందా?అనుకున్న సమయానికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతారా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…