Senior NTR: రెండు రోజులైనా ఎన్టీఆర్ లేవలేదు.. ఆమె ఏడుస్తూనే ఉంది !

Senior NTR: తెలుగు తెర పై క్రమశిక్షణ అనే పదానికి ప్రతీకగా నిలిచారు ‘సీనియర్ ఎన్టీఆర్’. తెరమీద ఎన్టీఆర్ చంద్రబింబంలా కనిపించేవారు, దానికి కారణం ఎన్టీఆర్ రూపురేఖలే అయినప్పటికీ.. వాటి వెనుక “బసవ రామతారకం” గారి కష్టం కూడా దాగి ఉంది. ఎన్టీఆర్ గారి అందం, ఆరోగ్యం విషయంలో ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకే, ఎన్టీఆర్ గారికి “బసవ రామతారకం” గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. వీరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి […]

Written By: Shiva, Updated On : May 3, 2022 4:19 pm
Follow us on

Senior NTR: తెలుగు తెర పై క్రమశిక్షణ అనే పదానికి ప్రతీకగా నిలిచారు ‘సీనియర్ ఎన్టీఆర్’. తెరమీద ఎన్టీఆర్ చంద్రబింబంలా కనిపించేవారు, దానికి కారణం ఎన్టీఆర్ రూపురేఖలే అయినప్పటికీ.. వాటి వెనుక “బసవ రామతారకం” గారి కష్టం కూడా దాగి ఉంది. ఎన్టీఆర్ గారి అందం, ఆరోగ్యం విషయంలో ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకే, ఎన్టీఆర్ గారికి “బసవ రామతారకం” గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది.

Chiranjeevulu Movie

వీరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి మీ కోసం ఓ ఉదాహరణ. అవి ”చిరంజీవులు” అనే చిత్రం షూటింగ్ జరుగుతున్న రోజులు. కథకు అనుగుణంగా ఎన్టీఆర్ గారికి కాంటాక్ట్ లెన్స్ పెట్టాల్సి వచ్చింది. పైగా భోజనం లేకుండా, నిద్రలేకుండా – పాత్ర మీద ఏకాగ్రతతో రాత్రీ పగలూ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. దాంతో కాంటాక్ట్ లెన్స్ బ్యాలెన్స్ తప్పాయి. ఎన్టీఆర్ గారి కంటి చూపు కొద్దిగా దెబ్బతింది. సరిగ్గా చూపు కనిపించడం లేదు.

Also Read: Films in May: మే లో రిలీజుకు రెడీ అవుతున్న చిత్రాలివే..!

దేనికీ పెద్దగా చలించని ఎన్టీఆర్ గారిలో కూడా ఆ రోజు టెన్షన్ మొదలైంది. డాక్టర్లు పరీక్షించి పూర్తి విశ్రాంతి అవసరం అన్నారు. కదలకూడదని చెప్పారు, నేరుగా ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు. ఎవరితో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని పడుకున్నారు. రాత్రి అయింది. ఎన్టీఆర్ లేవలేదు. తెల్లారి అయ్యింది, ఇంకా లేవలేదు. చూస్తుండగానే రెండు రోజులు గడిచిపోయాయి.

ఎన్టీఆర్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసుకున్నారు, అంతా అంధకారం. డాక్టర్ ఇచ్చిన కంటి మందు వేసుకుని మళ్ళీ పడుకున్నారు. మూడవ రోజున కళ్ళు తెరిచారు. మిణుకు మిణుకుమంటూ చిన్న వెలుతురు కనిపించింది. ఎన్టీఆర్ లో ఆశ చిగురించింది. నెమ్మదిగా పైకి లేచి మూసివున్న తలుపు తెరిచారు. గుమ్మం దగ్గర అచేతనంగా బసవ రామ తారకంగారు కూలబడి ఉన్నారు. ఎన్టీఆర్ ఆమెను చూసి ఆశ్చర్యపోతూ ‘ఏమిటి మీరు.. ఇలా పడుకున్నారు ?’ అని అడిగారు.

Chiranjeevulu Movie

 

ఎదురుగా ఎన్టీఆర్ గారిని చూసిన బసవ రామ తారకం గారు కళ్ళు తుడుచుకుని ”మీరు మనోవేదనతో ఒంటరిగా గెడవేసుకుని గదిలోనే ఉండిపోతే.. నేను ఇలా కాకుండా ఎలా ఉంటాను ?’ అంటూ దుఃఖంతో అన్నారామె. ఆ మాటలకు ఎన్టీఆర్ చలించిపోయారు. బసవ రామ తారకం గారు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా తన కోసం ఏడుస్తూ ఉండటం ఎన్టీఆర్ హృదయాన్ని కదిలించింది. ఇదే విషయాన్ని ఆయన ఎప్పుడు చెబుతూ ఉండేవారు.

‘నా ఆరోగ్యం కోసం అంతలా అల్లాడిపోయిన ఆమెలో నాకు అర్ధాంగే కాదు… అనురాగం నిండారిన ఓ దేవతామూర్తి కనిపించింది. ‘జీవన సహభాగిని’ అనే పదం కూడా ఆమె అంకిత భావం ముందు చిన్నది’ అని ఎన్టీఆర్ అనేవారు. అప్పటి నుంచి బసవ రామ తారకం గారంటే ఎన్టీఆర్ కు గౌరవంతో పాటు ఆరాధనా భావం ఉండేది.

Also Read: Keerthy Suresh: ‘కీర్తి సురేష్’ బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఫాలో అయితే అందం మీదే !

Tags