NTR Dragon climax: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో కూడా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకొని సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి అందులో భాగంగానే ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటికే వరుసగా ఏడు విజయాలను అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎనిమిదో విజయాన్ని అందుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 14వ తేదీన వార్ 2 (War 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించబోతున్నారట…హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా ఆయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ (Dragon) సినిమా సైతం వచ్చే సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. పాన్ ఇండియా లో ఉన్న రికార్డ్ లను బ్రేక్ చేసే విధంగా 2000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొడతాడా?
ALso Read: సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ను తన కాంపౌండ్ కే పరిమితం చేయనున్నారా..?
లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…ప్రశాంత్ నీల్ అంటే భారీ సెట్టింగులతో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని తీయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు కావడం విశేషం…మరి ఈయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే విధంగా ఉండబోతుందనే విషయం అయితే మనందరికి తెలిసిందే…
ఇక ఇప్పటివరకు షూటింగ్ చేసింది ఒకెత్తయితే ఇప్పుడు క్లైమాక్స్ షూట్ చేయబోయేది మరొకెత్తుగా మారబోతోందట…ఇక ఈ సినిమా మొత్తానికి క్లైమాక్స్ హైలెట్ గా నిలువబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొనడమే కాకుండా ఎక్కువ శాతం డూప్ లేకుండా తనే నటిస్తున్నాడట…
Also Read: ప్యారడైజ్ లో కిల్ ఫేమ్ రాఘవ్ జ్యూయల్ చేసే పాత్ర ఏంటో తెలుసా..? నాని కి తనకి సంబంధం ఏంటంటే..?
అయితే ఆఫ్రికాలో ఆ ఫైట్ ను చిత్రీకరించాలనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ నీల్ ఉన్నారట. మరి మొత్తానికైతే వచ్చే నెలలో సినిమా యూనిట్ ఆఫ్రికా వెళ్లి ఈ ఫైట్ షూట్ ని చేసి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. 20 రోజులపాటు ఈ క్లైమాక్స్ ఫైట్ ను చిత్రీకరించే అవకాశాలైతే ఉన్నాయట. దీనికోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లని తీసుకున్నట్టుగా తెలుస్తోంది…