
మొదటా షూటింగ్ చేద్దాం.. రిలీజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టుగా ఉండేది తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితి! కానీ.. ఈ కండీషన్ రాను రానూ మారిపోతోంది. సినిమా ప్రారంభం రోజునే రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు. అయితే.. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని అంతకన్నా సూపర్బ్ గా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్.
Also Read: స్వచ్ఛమైన ప్రేమకథ.. ఆర్ఆర్ఆర్ లో ‘అల్లూరి సీత’ వ్యథ!
ప్రస్తుతం ఎన్టీఆర్ RRRతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మధ్యలో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కూడా ఉంది. పలు కారణాలతో RRR షూట్ వాయిదాపడడం.. మధ్యలో ఈ రియాలిటీ షో వచ్చి పడడంతో త్రివిక్రమ్ సినిమా ఆలస్యమైంది. అయితే.. ఇప్పుడు పిక్చర్ క్లియర్ అయ్యింది. తాను షూటింగ్ లో ఎప్పట్నుంచి పాల్గొంటానో ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వడంతో.. మొత్తం సెట్ చేసిన త్రివిక్రమ్ లాంచింగ్ డేట్ తోపాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశాడట!
అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏప్రిల్ 13న సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతున్నారట. ఇక, మే నుంచి మొదలయ్యే రెగ్యులర్ షూటింగ్.. సినిమా పూర్తయ్యే వరకూ కొనసాగుతూనే ఉంటుందట. వరుస షెడ్యూళ్లతో నిర్విరామంగా సాగుతుందని తెలుస్తోంది.
Also Read: ‘ఎవరు మీలో కోటిశ్వరులు’కోసం ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్!
ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత.. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. దానికి కూడా ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా కంప్లీట్ చేసి, ఆ తర్వాత సినిమా ప్రమోషన్ మొదలు పెడతారు. వీటన్నింటినీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి, 2022 ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్