NTR Trivikram Movie Update: ఒక సినిమా కథ రాయాలి అంటే ఎంతో టాలెంట్ ఉండాలి. దానిని ప్రేక్షకుడికి నచ్చే విధంగా కన్వర్ట్ చేయాలి అంటే దానికి చాలా గట్స్ ఉండాలి. అలాంటి కథలను రాసి, సినిమాలో క్యారెక్టర్లు మాట్లాడుకునే మాటలను సైతం చాలా అలవోకగా రాసి మెప్పించగలిగే కెపాసిటి ఉన్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్… కెరియర్ స్టార్టింగ్ లో టాప్ రైటర్ గా పేరు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత దర్శకుడి గా మారి విభిన్నభరితమైన సినిమాలను తెరకెక్కించాడు. స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూనే యంగ్ హీరోలతో కూడా కొన్ని సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా కోసం ఆయన తీవ్రమైన కసరత్తులు చేయడానికి సిద్ధమవుతున్నాడు… ఇప్పటివరకు త్రివిక్రమ్ చేసిన సినిమాలన్నీ గొప్ప విజయాలను సాధించడమే కాకుండా అతనికి మాటలు మాంత్రికుడిగా బిరుదును కూడా తీసుకొచ్చి పెట్టాయి. అలాంటి గొప్ప పేరు సంపాదించుకున్న రచయిత, దర్శకుడు ఇప్పుడు ఎలాంటి సినిమాలు డెలివరీ చేస్తాడనేది ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది. మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయనకు స్టార్ హీరోల నుంచి ఛాన్స్ కరువైంది. ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న సినిమాతో ప్రూవ్ చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ సినిమా మీద అంచనాలు పెంచాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లతో తెరక్కబోతుందని ప్రొడ్యూసర్ నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ సినిమా బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తుంటే అర్థమైందట. మరి ఈ బడ్జెట్ ని కనుక పెంచుకుంటూ పోతే జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న మార్కెట్ ను బట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న క్రేజ్ ను బట్టి ఈ సినిమా వర్కౌట్ అవుతుందా? లేదా అనే ధోరణిలోనే కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ బడ్జెట్ కనక పెరిగినట్టైతే ఓవర్ బడ్జెట్ కారణంగా సినిమాని ఆపివేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాతో ప్రూవ్ చేసుకుంటే తప్ప ఈ సినిమాకి బడ్జెట్ 600 నుంచి 700 కోట్ల వరకు పెట్టడానికి ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చే అవకాశాలైతే లేవు.
ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి… ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడితేనే త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఏమాత్రం తేడా జరిగిన కూడా ఈ ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది…