https://oktelugu.com/

RRR Trailer Launching Event: ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ లాంచింగ్ లో ఎన్టీఆర్ దుమ్ముదులిపాడు

RRR Trailer Launching Event: ఆర్ఆర్ఆర్ మూవీ టీజర్లు వివిధ భాషల్లో రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా అందరి అభిమానం.. అభినందనలు అందుకుంటున్నాయి. ముంబైలో జరిగిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ వేడుకలో మూవీ యూనిట్ పాల్గొంది. హిందీ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవ్ గణ్, ఆలియాభట్, రాజమౌళి, దానయ్య, పెన్ స్టూడియోస్ అధినేతలు పాల్గొని విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. హిందీ విలేకరులతో తనదైన […]

Written By:
  • NARESH
  • , Updated On : December 9, 2021 / 09:58 PM IST
    Follow us on

    RRR Trailer Launching Event: ఆర్ఆర్ఆర్ మూవీ టీజర్లు వివిధ భాషల్లో రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా అందరి అభిమానం.. అభినందనలు అందుకుంటున్నాయి. ముంబైలో జరిగిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ వేడుకలో మూవీ యూనిట్ పాల్గొంది. హిందీ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవ్ గణ్, ఆలియాభట్, రాజమౌళి, దానయ్య, పెన్ స్టూడియోస్ అధినేతలు పాల్గొని విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

    RRR Trailer Launching Event In Mumbai

    హిందీ విలేకరులతో తనదైన మాటలు, కౌంటర్లతో జూనియర్ ఎన్టీఆర్ దుమ్ముదులిపేశాడు. కష్టమైన ప్రశ్నలకు కూడా తెలివిగా సమాధానం ఇచ్చాడు.

    అజయ్ దేవ్ గణ్ ను మించి నటించావని హిందీ విలేకరులు ప్రశ్నించగా.. ఆయనతో తనను పోల్చవద్దని.. అజయ్ గొప్పనటుడు అని.. ఆయన సినిమాలు చూస్తూ తాను పెరిగానని.. తాను ఆయన ముందు చాలా చిన్న వ్యక్తిని అని ఎన్టీఆర్ వినమ్రంగా చెప్పుకొచ్చాడు.

    Also Read: ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ లో ఈ మిస్టేక్ గమనించారా … కారణం ఏదైనా ఉందా

    ఇక రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడితో తాను హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టడం ఆనందం కలిగిస్తోందని తారక్ అన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు హిందీ ఆడియెన్స్ నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో చూడాలని చాలా కోరికగా ఉందని తారక్ అన్నాడు.

    రాజమౌళి షూటింగ్ సందర్భంగా ఎంతో హింసించాడని.. అందుకే ఇంత బాగా ఔట్ పుట్ వచ్చిందని తారక్ చెప్పుకొచ్చాడు. రాంచరణ్ మరదలు పెళ్లిలో ఉండడంతోనే రాలేకపోయాడని రాజమౌళి వివరించాడు.

    ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్

    Also Read: అనుకున్నదే అయ్యింది… రాజమౌళి పక్షపాతం చూపించాడుగా !