https://oktelugu.com/

NTR’s ‘Ayudha Puja’ Song : ఎన్టీఆర్ ‘ఆయుధ పూజ’ కోసం 10 కోట్ల రూపాయిల ఖర్చు..చరిత్రలో ఇదే తొలిసారి!

దేవర సినిమా మొత్తానికి హైలైట్ గా 'ఆయుధ పూజ' సాంగ్ ఉంటుందట. ఈ పాట చిత్రీకరణతోనే ఎన్టీఆర్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ పాట విడుదల అయ్యాక ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలని మర్చిపోతారట. ఇప్పుడే ఈ పాటని విడుదల చేస్తే తట్టుకోలేరు, చివర్లో విడుదల చేస్తాం అంటూ ట్విట్టర్ లో దేవర హ్యాండిల్ నుండి ఒక అభిమానికి సమాధానం వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 18, 2024 / 10:36 PM IST

    NTR 'Ayudha Pooja' song

    Follow us on

    NTR’s ‘Ayudha Puja’ Song : టాలీవుడ్ మొత్తం ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం మేనియా లో మునిగిపోయింది. ఎక్కడ చూసినా ఈ సినిమాకి సంబంధించిన పాటలే వినిపిస్తున్నాయి. టీజర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆచార్య లాంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాని తీసిన కొరటాల శివ, తదుపరి చిత్రాన్ని ఇంత క్వాలిటీ తో ఎలా తియ్యగలిగాడు అని ప్రేక్షకులు, అభిమానులు మొత్తం ఆశ్చర్యపోయారు. ఆచార్య చిత్రానికి ముందు కొరటాల శివకి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడిగా కొరటాల శివకి ఒక బ్రాండ్ ఇమేజి ఉండేది. ఇప్పుడు మరోసారి ఆ బ్రాండ్ ఇమేజి కి పదునుపెట్టేలా దేవర చిత్రాన్ని ఎంతో కసిగా తెరకెక్కించాడు. బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా కూడా తగ్గడం లేదు.

    ప్రతీ అంశం ఎంతో గ్రాండియర్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లో ఈమధ్య కాలంలో దేవర లాంటి ఆల్బం రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విడుదలైన ప్రతీ పాట విస్ఫోటనం లాగ పేలి సినిమా మీద అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది. 10 రోజుల క్రితం విడుదలైన మెలోడీ సాంగ్ ‘చుట్టమల్లే’ కి యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మూడవ పాట గురించి ‘దేవర’ మూవీ టీం ట్విట్టర్ లో అభిమానులకు రెస్పాన్స్ ఇచ్చింది. ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా ‘ఆయుధ పూజ’ సాంగ్ ఉంటుందట. ఈ పాట చిత్రీకరణతోనే ఎన్టీఆర్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ పాట విడుదల అయ్యాక ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలని మర్చిపోతారట. ఇప్పుడే ఈ పాటని విడుదల చేస్తే తట్టుకోలేరు, చివర్లో విడుదల చేస్తాం అంటూ ట్విట్టర్ లో దేవర హ్యాండిల్ నుండి ఒక అభిమానికి సమాధానం వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కేవలం ఈ ఒక్క పాట కోసం 10 కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట. ఇక అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆ పాట ఉండబోతుంది అనేది.

    రోజురోజుకి అంచనాలు ఈ చిత్రం మీద పెరిగిపోతూ ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఒకవేళ అందుకుంటే మాత్రం ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. రాజమౌళి తో సినిమా చేసిన వెంటనే ఒక హీరో సూపర్ హిట్ కొట్టాడా అనేది ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు. #RRR తర్వాత రామ్ చరణ్ వెంటనే కొరటాల శివ దర్శకత్వం లో ‘ఆచార్య’ చిత్రంలో నటించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ అదే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం చేసాడు. ఫలితం ఎలా ఉంటుందో అని అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఉత్కంఠ కి తెరపడాలంటే సెప్టెంబర్ 27 వరకు ఆగాల్సిందే.