
NTR – Balakrishna : గత కొద్ది రోజుల నుండి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఒక వీడియో బాగా ఇబ్బందికి గురి చేసింది.నందమూరి తారకరత్న పెద్ద ఖర్మ జరిగిన రోజు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లకు నందమూరి బాలకృష్ణ నుండి ఘోరమైన అవమానం జరిగిందని అభిమానులు తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు.అక్కడకి వచ్చిన ప్రతీ ఒక్కరిని పేరు పేరున పలకరించిన బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం పలకరించలేదని టాక్.
ఆయన నడుచుకుంటూ వస్తున్న సమయం లో బాబాయ్ కదా అని గౌరవిస్తూ పైకి లేచి నిలబడితే తనతో మాట్లాడడం మానేసి పక్కన ఎవరెవరితోనో మాట్లాడుతూ ఎన్టీఆర్ ని పట్టించుకోవడం మానేసాడు.ఆ వీడియో పై గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా లో పెద్ద రగడ జరుగుతుంది,పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు పొందిన ఎన్టీఆర్ కి ఒకరికి తలవంచాల్సిన అవసరం ఏముంది, ఇక ఎన్ని రోజులని భరించాలి వీళ్ళను అంటూ ఎన్టీఆర్ ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా అభిమానులు ట్వీట్స్ వేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా తన అభిమానుల నుండి వస్తున్న ఈ నిరసనలను ఎన్టీఆర్ తన PR టీం ద్వారా తెలుసుకున్నాడట.చిన్నప్పటి నుండి అవమానాలు నాకేమి కొత్త కాదు, అన్నీ చూసి నేడు ఈ స్థాయికి చేరుకున్నాను, దేనికైనా టైం రావాలి,సమయం వచ్చినప్పుడు అభిమానుల ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతాయి అంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉండగా తారకరత్న చనిపోయినందున HCA అవార్డ్స్ మరియు అంతర్జాతీయ మీడియా తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడని జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి కాబట్టి, ఈ నెల 12 వ తారీఖున జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి పాల్గొనేందుకు USA కి బయలుదేరాడు.12 వ తేదీన రామ్ చరణ్ , రాజమౌళి మరియు కీరవాణి వంటి వారితో కలిసి ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో సందడి చెయ్యబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.