Chiranjeevi Rejected Super Hit Movie: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గరనుంచి ఇప్పుడున్న యంగ్ హీరోల దాకా ప్రతి ఒక్కరు వాళ్ళ కెరియర్ లో ఏదో ఒక సినిమాను మిస్ చేసుకొనే ఉంటారు. వాళ్ళు రిజెక్ట్ చేసిన సినిమాలు ప్లాప్ అయితే పర్లేదు కానీ ఆ సినిమాను అవుతల హీరో చేసి మంచి విజయాన్ని అందుకున్నప్పుడు అరే నేను ఎందుకు ఆ సినిమాను మిస్ చేసుకున్నానా అని హీరోలు బాధపడిన సందర్భాలు చాలానే ఉంటాయి… ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం ఒక సినిమాను మిస్ చేసుకొని చాలావరకు బాధపడ్డాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘అరుణాచలం’ సినిమా కావడం విశేషం… అప్పట్లో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది.
సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రజనీకాంత్ మార్కెట్ ను అమాంతం పెంచేసింది…ఈ సినిమా కథ మొదట చిరంజీవి దగ్గరికి వచ్చిందట. కానీ చిరంజీవి అప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల ఈ స్టోరీ ని రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాని రజనీకాంత్ తో చేసి సూపర్ సక్సెస్ ని సాధించారు.
Also Read: ఆ విషయంలో ప్రశాంత్ నీల్ కి మెసేజ్ లు పెడుతున్న ఎన్టీఆర్ అభిమానులు…?
ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలి అంటే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. కథ బాగున్నప్పటికి దర్శకుడు దానిని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయి. అదే కోణంలో సి సుందర్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలపాడు. రజినీకాంత్ స్టైల్ కూడా ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది.
రజినీకాంత్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేశాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఈ విషయం తెలుసుకున్న చాలామంది ఈ సినిమా రజినీకాంత్ కి మాత్రమే సెట్ అయిందని, చిరంజీవి చేస్తే అంత బాగా సెట్ అయ్యేది కాదని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి కెరీర్ లో ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమా ను మిస్ చేసుకున్నాడనే చెప్పాలి…