NTR Prashanth Neel Movie Climax: కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన ‘సలార్’ సినిమాతో ఇండియా వైడ్ గా ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేశాడు. భారీ సినిమాలను తీయడంలో ప్రశాంత్ నీల్ సిద్ధహస్తుడు అనే ఒక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. అలాంటి ప్రశాంత్ నీల్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను పెట్టి డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగినట్టుగా తెలుస్తుంది… ఎన్టీఆర్ గత కొన్ని రోజుల నుంచి సక్సెస్ లను సాధించినప్పటికి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు. వార్ 2 సినిమాతో ఒక ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు డ్రాగన్ సినిమా మీదనే భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. దానికోసమే తన లుక్కు మొత్తాన్ని చేంజ్ చేశాడు.
ప్రశాంత్ నీల్ ఏది చెబితే అది చేస్తున్నాడట. ఇక సినిమా సక్సెస్ అవ్వడమే తనకు ముఖ్యం అంటూ ప్రశాంత్ నీల్ దగ్గర చెబుతున్నాడట. ఎట్టి పరిస్థితిలోనూ ఈ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాలనే టార్గెట్ తో అటు ప్రశాంత్ నీల్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు…
ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ ని షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఫైట్ లో జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించబోతున్నారట. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రళయ కాల రుద్రుడిగా కనిపించబోతున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్లు ప్రేక్షకులందరిని మెప్పించి మంచి విజయాలుగా నిలిచాయి.
కాబట్టి ఈ సినిమాలో సైతం తన పూర్తి స్థాయి యాక్షన్ ని బయటికి తీసి సినిమాలో భారీ ఎలివేషన్స్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి. ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్క్ ను ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి చూపిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…