NTR Prashanth Neel Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్)అనే సినిమా వస్తోంది. ఇక ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ చాలా సన్నగా అయ్యాడు.రీసెంట్ గా ఆయన లుక్ ని చూస్తే తన అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అతను చాలా సన్నబడిపోయి అసలు హీరోలానే కనిపించడం లేదంటూ కామెంట్లు చేస్తుండడం విశేషం… ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దగ్గరుండి మరి జూనియర్ ఎన్టీఆర్ యొక్క మేకోవర్ కి సంబంధించిన పనులను చూసుకుంటున్న ఒక ఫోటో బయటకు వచ్చింది. ఇందులో నీల్ దగ్గరుండి జూనియర్ ఎన్టీఆర్ గడ్డం ను సెట్ చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ సైతం రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అది చూసిన ప్రతి ఒక్కరు వైల్డ్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ చాలా గంభీరంగా ఉన్నాడు అంటు కామెంట్స్ చేస్తున్నారు. ఇక దానికి అనుగుణంగానే ఆ సినిమాలో ఆయన లుక్కు అద్భుతంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలిగే కెపాసిటి జూనియర్ ఎన్టీఆర్ కి ఉంది. కానీ అతనికి సరైన సక్సెస్ రావడం లేదు అంటూ తన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నప్పటికి అవి బ్లాక్ బస్టర్లుగా కన్వర్ట్ అవ్వడంలో మాత్రం చాలావరకు జూనియర్ ఎన్టీఆర్ వెనుకబడిపోయాడు. అందువల్లే తన తోటి హీరోలందరికి ఇండస్ట్రీ హిట్లు ఉన్నప్పటికి తనకి ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ హిట్ లేకపోవడంతో తన అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు…
ఇక డ్రాగన్ సినిమాలో ఆయన లుక్కు వైల్డ్ గా ఉంటుందా అనేది తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాల్సిన అవసరమైతే ఉంది. అలాగే ఈ సినిమా నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేస్తే సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుందనే విషయం మీద కూడా సరైన క్లారిటీ వస్తుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…