NTR30 Update: ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించి కొత్తగా ఒక అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇప్పటికే ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు టైం కేటాయించాడు. ఇప్పుడు, ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు పక్కా ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాడు. ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబులతో వరసగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలనే ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.
Also Read: ఎన్టీఆర్ చేతి రాతను ఎప్పుడైనా చూశారా.. కడిగిన ముత్యాలే..!
ఇందులో భాగంగా ముందుగా క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి తారక్ – కొరటాల సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ సినిమాకు ‘అనిరుధ్ రవిచందరన్’ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ తో ‘అనిరుధ్ రవిచందరన్’ ఎప్పుడో ఒక సినిమా చేయాల్సి ఉంది. గతంలో ఫిక్స్ అయిన కాంబినేషన్ ఇది. పైగా అనిరుధ్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గత రెండు సినిమాలుగా ఎదురుచూశాడు.
కానీ కొన్ని కారణాల వల్ల ఈ కలయిక కుదరలేదు. అయితే, ఎన్టీఆర్ చొరవతో ఇప్పుడు ఈ కలయిక కుదిరింది. ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకు అనిరుధ్ సంగీతం ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్టోరీ సిటింగ్స్ జరుగుతున్నాయి. ఈ సిటింగ్స్ లో రచయిత మచ్చ రవితో పాటు సీనియర్ రైటర్ సత్యానంద్ కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమా కథ ఫైనల్ అయ్యాక, షూటింగ్ స్టార్ట్ అవుతుందట.
Also Read: ఆ అసంతృప్తే ఎన్టీఆర్ ను చరిత్రలో నిలిచేలా చేసింది…