Dragon Movie NTR Photo: ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్)… ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. గత కొద్దిరోజుల నుంచి ఈ మూవీ మీద ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాని వీలైనంత తొందరగా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన నాలుగు షెడ్యూల్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన ప్రశాంత్ నీల్ తొందర్లోనే మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీఆర్ కి భారీ సక్సెస్ ని కట్టబెట్టాలనే ప్రయత్నంలో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధించి పెడితే మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ప్రశాంతనీల్ కి గుడి కట్టిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ నుంచి ఒక పోస్టర్ లీక్ అయిందని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్ పోనీ టేల్ వేసుకొని, టీ షర్ట్ ఇన్షర్ట్ వేసుకొని, సిగరెట్ నోట్లో పెట్టుకొని కారుకి అనుకోని ఉన్న ఒక స్టీల్ విపరీతంగా వైరల్ అవుతోంది… నిజంగానే ఈ లుక్ తో ఎన్టీఆర్ సినిమాలో కనిపిస్తే మాత్రం థియేటర్లు తగలబడిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇది ఫ్యాన్ మేడ్ గా చేసుకున్న ఫోటోనా? లేదంటే సినిమా మేకర్స్ కావాలనే ఒక పీక్ ను జనాల్లోకి వదిలారా అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే ఈ లుక్ లో ఎన్టీఆర్ కనిపిస్తే మాత్రం ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవుతాయనేది వాస్తవం… చాలా స్టైలిష్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ని ఈ రేంజ్ లో ఎవరూ చూపించలేదు.
కాబట్టి ఈ లుక్ తో ఎన్టీఆర్ ను చూపిస్తే ప్రశాంత్ నీల్ పీడా సాహసం చేసి సక్సెస్ సాధించినవాడవుతాడు. ఎందుకంటే ఎన్టీఆర్ కి ఈ లుక్ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు…ఇక ప్రస్తుతం ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది… ఇక తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని, టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది…