https://oktelugu.com/

Rajamouli Combo: మహేష్-రాజమౌళి కాంబోపై ఎన్టీఆర్, చరణ్ సెటైర్లు..!

Rajamouli Combo: ‘బాహుబలి’ సిరీసులతో దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటాడు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగింది. ఈ మూవీలో నటించిన డార్లింగ్ ప్రభాస్,  దగ్గుపాటి రానాలు పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు. వీరివురు వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్న సంగతి అందరికి తెల్సిందే..! ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దాదాపు మూడేళ్లపాటు చిత్రీకరణ పూర్తి చేసుకున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : December 28, 2021 / 12:56 PM IST
    Follow us on

    Rajamouli Combo: ‘బాహుబలి’ సిరీసులతో దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటాడు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగింది. ఈ మూవీలో నటించిన డార్లింగ్ ప్రభాస్,  దగ్గుపాటి రానాలు పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు. వీరివురు వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్న సంగతి అందరికి తెల్సిందే..!

    SS Rajamouli with NTR and Charan

    ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దాదాపు మూడేళ్లపాటు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈమూవీ జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. దీంతో ఈమూవీకి కోసం అభిమానులు ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు.

    Also Read: Nizam: నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ దండయాత్ర..!

    ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ ను చిత్రయూనిట్ భారీగా చేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో అదిరిపోయే ప్రమోషన్స్ చేస్తోంది. తారక్, చెర్రీలతోపాటు జక్కన్న మూవీ ప్రమోషన్స్ ను తన భుజస్కంధాలపై మోస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్, ఓటీటీ హక్కులు ఇప్పటికే భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

    ఇక ఈమూవీ ప్రమోషన్స్ భాగంగా రాజమౌళి నెక్ట్ సినిమాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. తన నెక్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి-మహేష్ బాబు కాంబోపై జూనియర్ ఎన్టీఆర్ ఊహించని విధంగా కామెంట్ చేయగా దానికి చెర్రీ సైతం వంతపాడటం ఆసక్తిని రేపుతోంది.

    మహేష్ బాబు-రాజమౌళి సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందని ఓ విలేకరి రాజమౌళిని ప్రశ్నించాడు. దీనికి రాజమౌళి పక్కనే ఉన్న ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘తప్పకుండా సినిమా 2026 లో వస్తుంది’ అంటూ సెటైర్ వేశాడు. ఆ తర్వాత మెల్లగా ఆలోచించి చర్చలతోనే వచ్చే ఏడాది మొత్తం పూర్తవుతుందని.. ఇక ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే 2025లోగా రావచ్చంటూ క్లారిటీ ఇచ్చాడు.

    ఆ తర్వాత ఎన్టీఆర్ కు రాంచరణ్ వంతపాడాడు. ఎన్టీఆర్ చెప్పంది కరెక్టేనని.. అది కూడా పాండమిక్ లేకుండా? ఎలాంటి సమస్యలు ఉంటేనే అంటూ కౌంటర్ ఇచ్చాడు.  వీరిద్దరు మాటలకు జక్కన తనలో తానే నవ్వుకున్నాడు. అయితే అభిమానులు ఇందులో నిజం లేకపోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    రాజమౌళి సినిమా సినిమాకు సంవత్సరాలు పెంచుకుంటూ పోతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. దీంతో ఈ మూవీ కోసం రాజమౌళి ఎన్నిరోజులు తీసుకుంటాడనే చర్చ అభిమానుల్లో సైతం నడుస్తోంది. ఏదిఏమైనా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రయూనిట్ అదిరిపోయే ప్రమోషన్స్ చేస్తూ నిత్యం ఈ సినిమా ట్రెండింగులో ఉండేలా ప్లాన్ చేస్తుండటం విశేషం.

    Also Read: SS Rajamouli: ‘దర్శకులందు రాజమౌళి లెస్స’.. జక్కన్న పై ప్రశంసల వర్షం