NTR Net Worth 2026: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆది, సింహాద్రి లాంటి మాస్ హిట్ లను దక్కించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ మూడో తరం బాధ్యతలను తన భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు.ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి లైఫ్ ను గడుపుతున్నాడు. తన నెట్ వర్త్ విలువ వచ్చేసి దాదాపు 4000 కోట్ల వరకు ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి… ఓపెన్ ప్లాట్స్, ఖరీదైన విల్లాలు, కార్లు, బంగ్లాలన్నింటిని బట్టి ఆయన నెట్ వర్త్ 4000 కోట్లకు పైన ఉంటుందట.
ఇంక దానికి తోడుగా ఆయనకున్న బిజినెస్ లలో కూడా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాని వల్ల కూడా అతనికి లాభం వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒక్కో సినిమా కోసం ఆయన దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుండటం విశేషం… ప్రస్తుతం ఆయన డ్రాగన్ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే తీవ్రమైన కసరత్తులు చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు… ఇక రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్స్ ని భారీగా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే సక్సెస్ లు వరిస్తే పర్లేదు కానీ ప్లాపులను మూట గట్టుకుంటే మాత్రం చాలా వరకు డీలా పడి పోయే ప్రమాదం ఉంది…
