‘అరవింద సమేత’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమాకు ప్లాన్ జరిగిన సంగతి తెలిసిందే. కానీ.. ఉన్నట్టుండి ఆ సినిమా ఆగిపోయింది. ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో వీరిద్దరూ తర్జనభర్జన పడడం.. చివరకు పొంతన కుదరకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని అంటున్నారు.
మంత్రిగారి వియ్యంకుడు లాంటి సినిమా చేద్దామని త్రివిక్రమ్ సూచించగా.. జూనియర్ వద్దన్నాడట. దీంతో.. భారీ యాక్షన్ లైనప్ చెప్పాడట త్రివిక్రమ్. అదికూడా వద్దన్న ఎన్టీఆర్.. ఫ్యామిలీ మూవీ కావాలని అడిగాడట. RRR తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి, పక్కా స్క్రిప్టుతో వస్తేనే సినిమా చేస్తానని చెప్పాడట జూనియర్. ఈ విధంగా వీరిద్దరి సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది.
అయితే.. ఈ సినిమాను హారిక, హాసిని సంస్థతోపాటు కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. రాధాకృష్ణ తనవాడే కాబట్టి డబ్బుల గురించిన చర్చ ఉండదు. కల్యాణ్ రామ్ మాత్రం ఈ సినిమాకు కోటి రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడట. ఇప్పుడు సినిమా ఆగిపోయింది కాబట్టి.. ఆ మొత్తాన్ని త్రివిక్రమ్ వడ్డీతో సహా తిరిగి చెల్లించాలట.
వడ్డీ అనేది ఇక్కడ మేటర్ కాదు.. అదిప్రిస్టేజియస్ ఇష్యూ. త్రివిక్రమ్ కెరీర్లో ఇప్పటి వరకూ అడ్వాన్స్ తిరిగి చెల్లించడం జరగలేదు. అలాంటిది.. వడ్డీతో సహా ఇవ్వాల్సి రావడం గమనార్హం. ఇదిలాఉంటే.. జూనియర్ – కొరటాల శివ సినిమా దాదాపుగా ఫిక్స్ అయినట్టే అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళ వచ్చే ఛాన్స్ ఉంది. మరి, అందులోనూ నిర్మాతగా కల్యాణ్ రామ్ ఉంటాడా? లేదా? అన్నది చూడాలి.