NTR: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరు వాళ్ళ ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇండస్ట్రీ హిట్ లేకుండానే టైర్ వన్ హీరోగా మారిపోయారు. ఇక అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ లేకపోవడం విశేషం… ఆయన చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ గా మారినప్పటికి అవి ఇండస్ట్రీ హిట్ గా మాత్రం మారలేకపోతున్నాయి. అయితే ఒక సినిమా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చేసి ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గా మారేదని అప్పట్లో సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్కు సినిమా కావడం విశేషం…
మొదట ఈ సినిమా కథని జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పినప్పటికి ఆయన ఆ కథను రిజెక్ట్ చేశాడు… ఈ సినిమా చేసి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ ను సాధించేవాడని అభిప్రాయపడుతున్నారు. మంచి సినిమాను మిస్ చేసుకొని ఆ తరువాత ఆయన దర్శకత్వంలోనే ఊసరవెల్లి అనే సినిమా చేశాడు.
ఈ సినిమా కూడా బాగున్నప్పటికి ప్రేక్షకులకు అంత పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇకమీదటైనా ఇండస్ట్రీ దక్కించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా భారీ మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తెలికెక్కుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ప్రశాంత్ నీల్ గతంలో చేసిన కేజిఎఫ్ సిరీస్, సలార్ సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాయి. మరి ఆ తరహాలోనే ఈ సినిమా కూడా సంచలనాన్ని క్రియేట్ చేసి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి…