https://oktelugu.com/

Rare Photo: ఆ ఇద్దరు పొలిటికల్ ఫైర్ బ్రాండ్స్ తో ఎన్టీఆర్… అరుదైన ఫోటో వైరల్, ఎప్పటిదో తెలుసా?

ఎన్టీఆర్ కొడాలి నానిలు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ త్రో బ్యాక్ ఫోటోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Written By: , Updated On : April 27, 2024 / 04:49 PM IST
NTR Rare Pic

NTR Rare Pic

Follow us on

Rare Photo: ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని – జూనియర్ ఎన్టీఆర్ ల త్రోబ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. సదరు ఫోటో చూసిన వారంతా కొడాలి నాని, ఎన్టీఆర్ కి ఇంత క్లోజా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ – వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కొడాలి నానిలు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఆ ఫొటోలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు వల్లభనేని వంశీ కనిపిస్తున్నారు. మధ్యలో కొడాలి నాని కూర్చుని సీరియస్ గా పుస్తకం చూస్తున్నారు. పక్కనే తారక్ నవ్వుతూ నాని కాలిపై కాలు వేసి కూర్చున్నారు. మరోవైపు వల్లభనేని వంశీ కూడా నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ త్రో బ్యాక్ ఫోటోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అప్పట్లో వీరు ముగ్గురు ఇంత క్లోజ్ గా ఉండేవారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

NTR, Kodali Nani and Vallabhaneni Vamshi Throwback Pic Goes Viral

NTR, Kodali Nani and Vallabhaneni Vamshi Throwback Pic Goes Viral

ఒకప్పుడు కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్, వల్లభనేని వంశీ మంచి స్నేహితులు. ముఖ్యంగా ఎన్టీఆర్, నాని మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. తారక్ తండ్రి హరికృష్ణ అంటే నానికి ఎంతో అభిమానం. అప్పట్లో టిడిపి పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన కొడాలి నానికి .. తారక్ మధ్య స్నేహం ఏర్పడింది. కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్ కి సినిమాల ఎంపిక విషయంలో నాని సలహాలు ఇచ్చేవారు. అప్పుడప్పుడు ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సెట్ లో సందడి చేసేవారు.

అలాగే తారక్ నటించిన చిత్రాలను కొడాలి నాని నిర్మించినట్లు సమాచారం. నాని పార్టీ మారడంతో గతంలో మాదిరి సన్నిహితంగా ఉండటం లేదు. హరికృష్ణ కూతురు ఇంట్లో జరిగిన ఓ పెళ్ళికి కొడాలి నాని హాజరు కావడం విశేషం. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే… దేవర, వార్ చిత్రాల షూటింగ్స్ ఏక కాలంలో పూర్తి చేస్తున్నారు. దేవర దసరా కానుకగా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.