Site icon OkTelugu

Harish Shankar: కెరియర్ మొదట్లో హరీష్ శంకర్ ను మోసం చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Do you know the star director who cheated Harish Shankar

Do you know the star director who cheated Harish Shankar

Harish Shankar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు హరీష్ శంకర్… ఈయన చేసిన గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా తన స్టార్ డమ్ అనేది తార స్థాయికి వెళ్లిపోయింది. ఇక అప్పటినుంచి ఆయన వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ గబ్బర్ సింగ్ లాంటి మరొక సాలిడ్ హిట్టు మాత్రం తన ఖాతాలో పడలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా టీజర్ తో అద్భుతాన్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా కనక రిలీజ్ అయితే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంటుదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఎందుకంటే ఆయన కమర్షియల్ సినిమాను తీయడంలో సిద్ధహస్తుడు. అలాగే పవన్ కళ్యాణ్ చరిష్మా ను వాడుకొని సూపర్ డూపర్ సక్సెస్ లను కొట్టడంలో కూడా ఆయనది అందవేసిన చేయి అనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో మరొక సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఒక 4 సంవత్సరాల పాటు ఆయన ఒక డైరెక్టర్ దగ్గర స్క్రిప్ట్ వర్క్ చేశాడట. నాలుగు సంవత్సరాలు ఆయన దగ్గర చాలా బాధలు పడుకుంటూ వర్క్ చేసినప్పటికీ స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ అయిన తర్వాత ఆ డైరెక్టర్ కి సినిమా ఒకే అయింది.

ఇక ముందు నుంచి హరీష్ శంకర్ ను ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా తీసుకుంటానని చెప్పిన ఆయన హరీష్ ను తీసుకోలేదట. ఇక దాంతో హరీష్ శంకర్ కి ఏడుపు ఆగలేదట. ఇక సినిమా ఓపెనింగ్ రోజు డైరెక్టర్ ను అడిగితే నాకున్న టెన్షన్స్ నాకు ఉన్నాయి మధ్యలో నీ నసేంటి అంటూ దర్శకుడు కసురుకున్నాడట.

దాంతో చేసేది ఏమీ లేక హరీష్ శంకర్ ఏడ్చుకుంటూ ఫ్రెండ్ రూం కి వెళ్ళాడట…ఒక డైరెక్టర్ తనని నాలుగు సంవత్సరాల పాటు వెంట తిప్పుకొని అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇవ్వకుండా మోసం చేశాడని రీసెంట్ గా తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…

Exit mobile version