
NTR Koratala Siva Movie: త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సిన జూ.ఎన్టీఆర్ కథ నచ్చక వైదొలగడంతో వీరిద్దరి కాంబినేషన్ పట్టాలెక్కలేదు. దీంతో త్రివిక్రమ్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేయగా.. జూ.ఎన్టీఆర్ ఏకంగా కొరటాల శివతో సినిమాను ప్రకటించారు. వీరిద్దరూ ప్రకటన చేసి చాలా రోజులే అవుతున్నా సెట్స్ పైకి మాత్రం సినిమా వెళ్లలేదు. చిరంజీవి ‘ఆచార్య’ సినిమా పూర్తికాకపోవడంతో కొరటాల శివ.. ఎన్టీఆర్ తో మూవీని ప్రారంభించడం లేదు. ప్రస్తుతం కొరటాల ‘ఆచార్య’ మూవీ టాకీ పార్ట్ పూర్తి చేశాడు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తి చేసి ఫ్రీ అయ్యారు. ప్రస్తుతం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షో చేస్తున్నారు.
కొరటాల ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ తో కేవలం మూడు షెడ్యూల్స్ లోనే ఈ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో కొరటాల ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాను ‘దసరా’ రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించి నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ మొదలుపెట్టాలనే ఆలోచనలో కొరటాల శివ ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం దాదాపు 7 కేజీల బరువు తగ్గే పనిలో పడ్డాడట..
కొరటాల సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక విద్యార్థి నాయకుడిగా కనిపించే సన్నివేశాలు హైలెట్ గా తీర్చిదిద్దినట్టుగా సమాచారం. అందుకోసం కాస్త సన్నబడాలని కొరటాల శివ ఎన్టీఆర్ ను కోరినట్టు సమాచారం.