NTR Blockbuster Movie Sequel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ అనే చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ లోని వింటేజ్ మాస్ యాంగిల్ ని బయటకి తీసింది..ముఖ్యంగా ఈ సినిమా లో వచ్చే మొదటి 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ కోలుకొని బలమైన కథతో రావడానికి చాలా సమయమే పడుతుంది అని అందరూ అనుకున్నారు..కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కేవలం 9 నెలల గ్యాప్ లో ఈ రేంజ్ కం బ్యాక్ ఇస్తాడు అని ఎవ్వరు ఊహించి ఉండరు..ఈ సినిమా తర్వాత నుండి ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది అని అందరూ అనుకున్నారు.

వాస్తవానికి #RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక్క సినిమా రావాల్సి ఉంది..అప్పట్లో ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు కూడా..భీమ్లా నాయక్ సినిమా నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించే ఛాన్స్ ని కొట్టేసాడు..కానీ స్క్రిప్ట్ డెవలప్ అవుతూ ఉన్న సమయం లో ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ మధ్య ఎరపడిన కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది..ఈ విషయం ని స్వయంగా ఆ చిత్ర నిర్మాత సూర్య ద్వారా నాగవంశీ అప్పట్లో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేసాడు..అప్పటి నుండి ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ మధ్య గ్యాప్ ఏర్పడింది అని..వీళ్లిద్దరి మధ్య ఆ తర్వాత మాటలే లేవు అని, ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి..అయితే అలాంటివి ఏమి లేదు అని ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా త్రివిక్రమ్ అతని ఇంటికి వెళ్లి సుమారు గంట వరుకు చేసిన సుదీర్ఘ చర్చ తేల్చేసింది.

Also Read: Dil Raju: ‘ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ’లతో పాన్ వరల్డ్ సినిమాలు !
#RRR తర్వాత ఎన్టీఆర్ రేంజ్ శిఖరం స్థాయికి చేరింది అని..అందుకే ఆయన ఇమేజి కి తగ్గ బలమైన స్టోరీ ని సిద్ధం చెయ్యాలి అని, ఆ స్టోరీ ఇప్పుడు అనుకున్నది అయితే కాదు అని త్రివిక్రమ్ తన సన్నిహితులతో అన్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త..అయితే మొన్న ఎన్టీఆర్ ని కలవడానికి గల ముఖ్య కారణం కొత్త సినిమా గురించే అట..అరవింద సామెత కి సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా తో ఎన్టీఆర్ ముందుకి వచ్చాడు అట త్రివిక్రమ్..టాలీవుడ్ మొత్తం ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యం లో, త్రివిక్రమ్ కూడా ఆ క్రేజ్ ని కాష్ చేసుకునేందుకు అరవింద సమేత సీక్వెల్ ని అనుకున్నాడు అట..ఒక్క అద్భుతమైన స్టోరీ లైన్ తో సీక్వెల్ స్క్రిప్ట్ ని ఇటీవలే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి వినిపించాడు అని..దానికి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అని తెలుస్తుంది..త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి..ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో పాటు ఆయన KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఈ రెండు సిఎంమాలు పూర్తి అయ్యిన తర్వాతనే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read: Analysis on Revanth Reddy Sensational Comments ఇంత పచ్చిగానా రేవంత్ రెడ్డి?
Recommended videos
[…] […]
[…] […]