NTR: నందమూరి తారక రామారావు (NTR) తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. ఆయన పేరు వింటేనే ఆశేషమైన అభిమానం ఉప్పొంగుతుంది. తెలుగు ప్రజలను గర్వపడేలా ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం సాగింది. ఎన్టీఆర్ సినిమాలు ఇప్పటికీ అందరి మదిలో నిలిచిపోతుంటాయి. ఆయన నటుడిగానే కాకుండా దర్శకనిర్మాత గాను వ్యవహరించారు.తన నటనా ప్రావీణ్యంతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన తన జీవితంలో ఎక్కువ రోజులు సినిమాలు చేస్తూనే ప్రేక్షకులను అలరించారు.
ఎన్టీఆర్‌ను తమ అభిమాన హీరోగా భావించిన ప్రజలు.. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టాక కూడా అంతే ప్రేమను చూపించారు. పార్టీని స్థాపించిన ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ఆయనకు పూర్తి మెజార్టీని కట్టబెట్టి ఏకంగా ముఖ్యమంత్రిని చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారు. చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి రావడంలో కూడా ఆయన కృషి ఎంతగానో ఉందని ఆనాటి దిగ్గజ నటులు చెప్పుకొచ్చారు. అనుకోని పరిణామాల వలన ఎన్టీఆర్ చివరి రోజుల్లో కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, తన రాజకీయ జీవితం కంటే సినీ జీవితంలో ప్రజలు తనను దేవుడిగా ఆరాధించారని సన్నిహితులతో చెప్పుకుని బాధపడ్డారని అనేక వార్తా కథనాలు వెలువడ్డాయి.
Also Read: ఆ అసంతృప్తే ఎన్టీఆర్ ను చరిత్రలో నిలిచేలా చేసింది…
ఎన్టీయార్ జీవితం తెరచి ఉంచిన పుసక్తమని చెప్పవచ్చును. ఆయనలో ఎన్నో కళలు దాగియున్నాయి. ముఖ్యంగా ఆయన చేతిరాత కడిగిన ముత్యం వలే ఉంటుందని మీలో ఎవరికైనా తెలుసా.. ఒకానొక సమయంలో ఆయన రీడర్స్ కోసం స్వయంగా తన చేతితో ఒక లెటర్ రాయగా అది పత్రికలో ప్రచురించారు.1966లో ఎన్టీయార్ ముఖచిత్రం ‘విజయచిత్ర’ద్వారా ప్రచురించబడింది. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాఠకుల కోసం ఓ లేఖ రాయాలని పబ్లిషర్ రావి కొండల రావు కోరగా అందుకు అన్నగారు ఓకే అన్నారట..
మీ చేతి రాత బాగుంటుందని మీరు రాస్తే పాఠకులు సంతోషిస్తారని అనడంతో తప్పకుండా బ్రదర్ అని చెప్పారట.. అలా సినిమా షూటింట్‌లో దొరికిన ఖాళీ సమయంలో మూడు పేజీల్లో పాఠకుల కోసం తన కలం నుంచి పదాలను జారవిడిచారు. ఆనాటి ప్రతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ రాతను చూసి నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: అప్పటి ముచ్చట్లు : ‘ఎన్టీఆర్ గారు పిలిస్తే.. రాకుండా ఎలా ఉండగలం ?