
NTR – Lakshmi Pranathi : టాలీవుడ్ లవ్లీ కపుల్ గా ఉన్నారు ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి. గత పన్నెండేళ్ళుగా వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుంది. వీరిది అరేంజ్డ్ మ్యారేజ్. ప్రణతి చుట్టాలమ్మాయే. వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కూతురు. హరికృష్ణ ఈ సంబంధం కుదిర్చి వివాహం చేశారు. లక్ష్మి ప్రణతి చాలా హోమ్లీ పర్సన్. హై కల్చర్డ్ ఫ్యామిలీలో పుట్టి పెరిగినా కూడా చాలా అణకువగా ఉంటారు. హంగులు ఆర్భాటాలకు పోరు. సోషల్ మీడియా వాడరు. పబ్లిక్ వేడుకల్లో పాల్గొనడానికి ఇష్టపడరు. ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలకు జన్మనిచ్చారు.
అయితే ఓ సందర్భంలో లక్ష్మి ప్రణతి మీద ఎన్టీఆర్ మండిపడ్డాడట. నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడట. టాలీవుడ్ వర్గాల్లో ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ఉంది. విషయంలోకి వెళితే, పెళ్ళైన మూడేళ్లకు ప్రణతి గర్భవతి అయ్యారు. ఆమెకు నెలలు నిండే సమయానికి ఎన్టీఆర్ రభస షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లారట. ఆయన అక్కడ ఉండగా లక్ష్మి ప్రణతికి నొప్పులు వచ్చే సూచనలు కనిపించాయట. అదే విషయం ఎన్టీఆర్ కి ఫోన్ చేసి చెప్పిందట.
నువ్వు నా పక్కన లేకుండానే నేను ప్రసవించేలా ఉన్నానని లక్ష్మి ప్రణతి భర్త ఎన్టీఆర్ తో చెప్పిందట. అప్పుడు ఎన్టీఆర్ ఆ పని చేస్తే నిన్ను చంపేస్తా. నేను వచ్చాక నీవు బిడ్డను కనాలని వార్నింగ్ ఇచ్చాడట. అయితే అది సీరియస్ గా కాదులెండి. ప్రేమతో స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట. మన మొదటి బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చే నాటికి నేను పక్కనే ఉండాలి. బిడ్డ పుట్టగానే నా చేతుల్లోకి తీసుకోవాలని ఎన్టీఆర్ అన్నారట.
2014 జులై 22న లక్ష్మి ప్రణతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. స్విజర్లాండ్ నుండి వచ్చిన ఎన్టీఆర్ కి ప్రణతి ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ అయ్యిందని చెప్పారట. అప్పుడు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నాడట. ఎన్టీఆర్ కోరుకున్నట్లే లక్ష్మి ప్రణతి ప్రసవించే సమయానికి ఆయన పక్కనే ఉన్నారట. జూన్ 14, 2018న లక్ష్మి ప్రణతి మరో అబ్బాయిని కన్నారు. చిన్న కొడుకు పేరు భార్గవ్ రామ్.