Prashant Neel – NTR : ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమా సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే తను నెక్స్ట్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన పనులను కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా 2024 ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రతి ప్రేక్షకుడి లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎన్టీయార్ ఒక నెల రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ 31 పేరు తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా లో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సలార్ సినిమా సక్సెస్ సాధించడంతో ప్రశాంత్ నీల్ పైన అదనపు బాధ్యత కూడా పెరిగింది.
అలాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా అనేసరికి చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ హీరోలకి ఎలివేషన్స్ ని ఇవ్వడం లో ఆయన ఒక తోపు డైరెక్టర్ అనే చెప్పాలి. ఇక సలార్ లో ప్రభాస్ ని ఎలాగైతే చూపించాడో అలాగే ఎన్టీఆర్ తో చేసే సినిమాలో కూడా ఎన్టీఆర్ లో ఉన్న దమ్మును చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక హీరోకి ఎలివేషన్స్ గాని, అతని ఎమోషన్స్ తో ఆ సినిమాని రక్తి కట్టించడంలో గాని ప్రశాంత్ నీల్ చాలా ముందు వరుసలో ఉంటాడు.
ఆ విషయం లో ఆయన ని మించిన డైరెక్టర్ ఇండియాలోనే లేడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమాకి అభిమానులు ప్రశాంత్ నీల్ ని ఒక విషయంలో మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నారు. అది ఏంటి అంటే సలార్ సినిమాకి మ్యూజిక్ అందించిన రవి బస్రుర్ ని ఎన్టీయార్ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవద్దు అంటూ వాళ్ళు చాలా రకాల హంగామా చేస్తున్నారు.
ఎందుకంటే కెజీఎఫ్ కి ఆయన ఇచ్చిన మ్యూజిక్ బాగుంది కానీ సలార్ సినిమాకి అంత పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేదు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత బాగా ఇవ్వలేదు కాబట్టి అతన్ని మారుస్తే బాగుంటుంది అంటూ ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ లు పంపుతున్నారు. ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఎన్టీఆర్ సినిమా ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది అంటూ చెబుతున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి…