వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ !

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు నేడు. సోషల్ మీడియాలో కొరటాలకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు సినీ ప్రముఖులు. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ఎన్టీఆర్, కొరటాలను ఉద్దేశించి.. ”స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ తారక్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. నిజానికి ఎన్టీఆర్, కొరటాలను ముందు నుండి ఎంకరేజ్ […]

Written By: admin, Updated On : June 15, 2021 1:59 pm
Follow us on

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు నేడు. సోషల్ మీడియాలో కొరటాలకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు సినీ ప్రముఖులు. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ఎన్టీఆర్, కొరటాలను ఉద్దేశించి.. ”స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ తారక్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

నిజానికి ఎన్టీఆర్, కొరటాలను ముందు నుండి ఎంకరేజ్ చేస్తున్నాడు. కొరటాలను స్టార్ రైటర్ ను చేసింది ఎన్టీఆరే. అప్పటినుండే కొరటాల – ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇక ప్రస్తుతం వీరి కలయికలో ఓ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. కొరటాల ప్రెజంట్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు. కొరటాలతో పాటు రచయిత కోన వెంకట్ కూడా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడట.

ఈ సినిమా కథ పై ఆ మధ్య ఒక పుకారు బాగా వైరల్ అయింది. ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో కొరటాల ఈ సినిమా కథ రాసుకున్నాడని, తెలుగు నేటివిటీకి తగ్గట్లు ఆ కథలో కొన్ని మార్పులు చేశారని, ఆ మార్పులో భాగంగా పలనాటి ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుండి.. ఫలానా స్టార్ హీరోయిన్ ఫిక్స్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే, బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ‘కియారా అద్వానీ’ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందట. ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తంగా మూడు గెటప్స్ లో కనిపించనున్నాడు. మరి ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఆ రోజున మరో ఏ పెద్ద సినిమా తమ సినిమాకి పోటీగా రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో చాల ముందుగానే విడుదల తేదీని ప్రకటించారు.