Homeఎంటర్టైన్మెంట్NTR Emotional Letter: ఎన్టీఆర్ ఎమోషనల్ లెటర్.. ఎవరి గురించి ఏమి చెప్పాడంటే ?

NTR Emotional Letter: ఎన్టీఆర్ ఎమోషనల్ లెటర్.. ఎవరి గురించి ఏమి చెప్పాడంటే ?

NTR Emotional Letter: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలయికలో వచ్చిన భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. స్నేహానికి ప్రాణమిచ్చే పాత్రలో ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా ఉంది. అమాయకత్వంతో కూడిన విప్లవ వీరుడు భీమ్ పాత్రలో తారక్ ఒదిగిపోయారు. తన నటనతో ఎన్టీఆర్ అబ్బురపరిచారు.

NTR Emotional Letter
NTR Emotional Letter

అయితే, తాజాగా ఆ సినిమా సాధిస్తోన్న విజ‌యం గురించి, సినిమాలో త‌న న‌ట‌న‌కు వ‌స్తున్న ప్ర‌శంస‌ల‌ గురించి ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ ఓ సుదీర్ఘ లెటర్ ను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఎన్టీఆర్ లెటర్ లో ఏమి రాశారో చూద్దాం. ‘మీరంద‌రూ ‘ఆర్ఆర్ఆర్‌’ లో మా నటనను అమితంగా ప్ర‌శంసిస్తూ ప్రేమ‌ వ‌ర్షం కురిపిస్తున్నారు. నా సినీ కెరీర్‌లో ల్యాండ్‌ మార్క్ ఫిల్మ్‌ గా నిలవబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేయడానికి ఈ లెటర్ రాస్తున్నాను.

Also Read: Aryan Khan: ప్చ్.. ఆ స్టార్ హీరో కొడుకుని వదిలేలా లేరు

కథను బట్టి నన్ను నేను విల‌క్ష‌ణ‌మైన వాట‌ర్ లాగా ఫీల్ అయ్యేలా చేసి.. నా నుంచి ఉత్త‌మ‌మైన న‌ట‌న‌ను రాబ‌ట్టిన జ‌క్క‌న్న‌కు నా కృతజ్ఞతలు. చ‌ర‌ణ్ లేని ‘ఆర్ఆర్ఆర్‌’ చిత్రాన్ని అస‌లు ఊహించుకోలేను. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌కు చ‌ర‌ణ్ త‌ప్ప ఇంకెవ‌రూ న్యాయం చేయ‌లేరు. తను అంత గొప్పగా నటించాడు. చరణ్ పాత్ర లేకుండా భీమ్ పాత్ర కూడా సంపూర్ణం కాదు.

లెజెండ‌రీ అజ‌య్ దేవ్‌గ‌ణ్‌ గారితో క‌లిసి ప‌నిచేయ‌డాన్ని నేను గౌర‌వంగా భావిస్తున్నాను. ఆలియా త‌న ప్రెజెన్స్‌ తో ఈ సినిమాకు గొప్ప బ‌లాన్నిచ్చింది. నటిగా ఆమె ఒక ప‌వ‌ర్‌ హౌస్.
ఒలీవియా, అలీస‌న్ డూడీ, రే స్టీవెన్స‌న్ లు కూడా త‌మ అభిన‌యంతో ప్రేక్షక హృద‌యాల‌ను ఆకట్టుకున్నారు. ఇండియన్ సినిమా వారికి స్వాగ‌తం చెబుతుంది. నిర్మాత డీవీవీ దాన‌య్య త‌మ వెనుక ఒక రాక్‌ లాగా నిలబడ్డారు.

NTR Emotional Letter
Jr NTR

ఈ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ నిజ‌మ‌వ‌డానికి కార‌ణం దాన‌య్యగారే. సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి, క‌థార‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, సినిమాటోగ్రాఫ‌ర్ సెంథిల్ కుమార్‌, క‌ళా ద‌ర్శ‌కుడు సాబు సిరిల్‌, వీఎఫ్ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్ శ్రీ‌నివాస్ మోహ‌న్‌, ఎడిట‌ర్ శ్రీ‌క‌ర ప్ర‌సాద్‌, లైన్ ప్రొడ్యూస‌ర్ కార్తికేయ‌, ‘కొమురం భీముడో’ పాట‌ను పాడిన కాల‌భైర‌వ‌, ‘నాటు నాటు’ సాంగ్‌కు సూప‌ర్బ్ స్టెప్స్ కూర్చిన కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్‌ల‌కు నా ప్రత్యేక ధ‌న్య‌వాదాలు’ అంటూ చివ‌ర‌గా భార‌తీయ మీడియాకు, నా అభిమానుల‌కు థాంక్స్ అంటూ ఎన్టీఆర్ లెటర్ ముగించారు.

Also Read: Legendary Directors Of Tollywood: ఆ కోరికతో అల్లాడిపోతున్న లెజెండరీ దర్శకులు

Recommended Video:

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular