NTR: ఎన్టీఆర్(Junior NTR) అభిమానులకు గత ఏడాది ‘దేవర'(Devara Movie) చిత్రం ఇచ్చిన కిక్ మామూలుది కాదు. #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత విడుదల అవుతున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు మొదటి నుండే భారీ రేంజ్ లో ఉండేవి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదట్లో డివైడ్ టాక్ తో మొదలై, ఆ తర్వాత సూపర్ హిట్ మౌత్ టాక్ ని తెచ్చుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం తర్వాత ఈ ఏడాది ఎన్టీఆర్ ‘వార్ 2’ తో వస్తాడు, ఈసారి వెయ్యి కోట్లు కొల్లగొడుతాడని అందరూ అనుకున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ మొదట్లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ తేదీన విడుదల అవ్వడం దాదాపుగా కష్టమే అని అంటున్నారు.
డిసెంబర్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. ఇది దాదాపుగా ఖరారు అవ్వడంతో, ఆగస్టు 14 న సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) తన ‘కూలీ'(Coolie Movie) సినిమాని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై కేవలం తమిళ ఆడియన్స్ లోనే కాదు, తెలుగు మరియు ఇతర సౌత్ మార్కెట్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఉపేంద్ర, సందీప్ కిషన్, శివ కార్తికేయన్(Siva Karthikeyan) వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాతో రజినీకాంత్ తమిళ సినిమా ఇండస్ట్రీ కి మొట్టమొదటి వెయ్యి కోట్ల గ్రాస్ ని అందిస్తాడని బలమైన నమ్మకం తో ఉంది అక్కడి ట్రేడ్. ఆగస్టు 14 న వస్తే, బాక్స్ ఆఫీస్ రికార్డుల వేట మామూలు రేంజ్ లో ఉండదని బలమైన విశ్వాసం తో ఉన్నారు.
కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం బంగారం లాంటి డేట్ మిస్ అయ్యిందే అనే బాధలో ఉన్నారు. వార్ 2(War2 Movie) లో హ్రితిక్ రోషన్(Hritik Roshan) హీరోగా నటిస్తుండగా, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నాడు. దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం,, కేవలం క్లైమాక్స్ చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ సినిమా కోసం డిసెంబర్ వరకు ఎట్టి పరిస్థితిలో ఆగాల్సిందే. ఇకపోతే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోనుంది. భారీ యాక్షన్ సన్నివేశంతో ఈ షూటింగ్ ని ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ కొద్దిరోజుల తర్వాత ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణీ వాసంత్ నటించబోతుంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ని అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.