NTR Villain: ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇండియా వైడ్ పాప్యులర్ అయ్యారు. బాలీవుడ్ మేకర్స్ ఎన్టీఆర్ తో చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ మేకర్స్ ఎన్టీఆర్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కారణం తెలియదు కానీ ఎన్టీఆర్ చేయను అన్నారట. దాంతో ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడిందట. మొత్తంగా ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది. చివరి ప్రయత్నంగా అల్లు అర్జున్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట.
కాగా వార్ 2 చిత్రాన్ని ఎన్టీఆర్ సైన్ చేశారు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ గా ఇది తెరకెక్కనుంది. బాలీవుడ్ వర్గాలు ఈ ప్రాజెక్ట్ ధృవీకరించాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో వార్ 2 పట్టాలెక్కే సూచనలు కలవు. వార్, పఠాన్ విజయాలతో జోరుమీదున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి ఓ క్రేజీ బజ్ వినిపిస్తుంది.
అనూహ్యంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ విలక్షణతతో కూడి ఉంటుందట. నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. వార్ 2 స్క్రిప్ట్ డెవలప్మెంట్ దశలో ఉండగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ ఓ కోణంలో విలన్ గా కనిపిస్తారట. ఈ మేరకు బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. గతంలో ఎన్టీఆర్ కొన్ని చిత్రాల్లో ఈ తరహా పాత్రలు చేశారు. జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ చేశారు. జై క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది.
విలనిజం పంచడంలో ఎన్టీఆర్ దిట్ట. ఇక వార్ 2లో ఆయన రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ మూవీలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్. మే 19న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. దేవర టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.