NTR And Ram Charan And Mahesh Babu: రీసెంట్ గానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) కి సంబంధించిన మైనపు విగ్రహాన్ని లండన్ లో మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం రామ్ చరణ్ లండన్ కి వెళ్ళాడు. ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన, క్లిన్ కారా వంటి వాళ్ళు కూడా వచ్చారు. అయితే రీసెంట్ గానే ఎన్టీఆర్ కూడా తన కుటుంబం తో కలిసి విమానాశ్రయం లో కనిపించడం మనమంతా చూసాము. ఎదో సమ్మర్ వెకేషన్ కి వెళ్తున్నాడని అభిమానులు అనుకున్నారు. కానీ ఆయన వెళ్ళింది సమ్మర్ అకేషన్ కి కాదు, లండన్ కి అని ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. నేడు సాయంత్రం ఆల్బర్ట్ హాల్ లో #RRR మూవీ లైవ్ పెర్ఫార్మన్స్ జరగనుంది. ఈ పెర్ఫార్మన్స్ కి ముందు ఒక ఇంటర్వ్యూ ని షెడ్యూల్ చేశారట.
ఈ ఇంటర్వ్యూ లో రామ్ చరణ్, ఎన్టీఆర్(Junior NTR), రాజమౌళి(SS Rajamouli), కీరవాణి(MM Keeravani) వంటి వారితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Rajinikanth) కూడా పాల్గొంటాడని టాక్. వీళ్ళ మధ్య జరిగే సంభాషణలు ఆసక్తికరంగా ఉండనున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి #RRR మూవీ ప్రొమోషన్స్ సమయంలో పదుల సంఖ్యలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఆ సినిమా విడుదలయ్యాక, కొన్నాళ్ళకు జపాన్ లో విడుదలైంది. అప్పుడు కూడా ప్రొమోషన్స్ లో వీళ్లిద్దరు కలిసి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు బయట కొన్నిసార్లు కలుసుకున్నారు కానీ, ఇంటర్వ్యూస్ ఎప్పుడూ ఇవ్వలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు వీళ్ళ కాంబినేషన్ లో ఒక ఇంటర్వ్యూ రాబోతుంది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉండబోతున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఒక ఫోటో దిగితేనే సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. అలాంటిది ఒక ఫుల్ ఇంటర్వ్యూ ఇస్తే ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు.
అభిమానులు జీవితాంతం పదిలంగా తమ జ్ఞాపకాల్లో పెట్టుకొని, కావాల్సినప్పుడు చూసుకోదగ్గ ఇంటర్వ్యూ గా ఇది మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో ఎన్టీఆర్, మహేష్ బాబు కలిసి ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అనే షోలో కనిపించారు. ఈ ఎపిసోడ్ లో వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఫన్నీ గా అనిపించింది. మహేష్ బాబు ఇండస్ట్రీ లో క్లోజ్ గా ఉండే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో కచ్చితంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉంటారు. వీళ్లిద్దరితో ఆయనకు ఉన్న బాండింగ్ మామూలుది కాదు. ఎన్టీఆర్ తో ఆ బాండింగ్ అనేక సందర్భాల్లో తెలిసింది కానీ, రామ్ చరణ్ తో ఉన్న బాండింగ్ మాత్రం బయటపడలేదు. కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితమైంది. చూడాలి మరి ఈ ఇంటర్వ్యూ లో ఈ ముగ్గురి మధ్య జరిగే సంభాషణ ఎలా ఉండబోతుంది అనేది.