NTR30 first look : #RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ క్రేజ్ ని దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ తో చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా, అప్పుడే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ఎంతో కసితో రాసుకున్న కథ ఇది,ఈ చిత్రం తో తనని తాను నిరూపించుకొని మళ్ళీ నెంబర్ 1 రేస్ లో నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు కొరటాల శివ.
అందుకే ఈ సినిమాకి సంబంధించి ప్రతీ విషయాన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.క్వాలిటీ విషయం లో ఆయన ఎక్కడా కూడా తగ్గడం లేదు, హాలీవుడ్ నుండి స్టంట్ మాస్టర్స్ ని అలాగే టెక్నిషియన్స్ ని కూడా ఆయన ఇక్కడకి రప్పించుకున్నాడు. ఇక మే 20 వ తారీఖున ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారని గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో వినిపించిన టాక్.
కాసేపటి క్రితమే ఈ ఫస్ట్ లుక్ కి సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించింది మూవీ టీం,మే 20 వ తారీఖున ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని 19 వ తేదీన విడుదల చేయబోతున్నామని ఒక కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా అభిమానులకు అధికారికంగా తెలియచేసారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ లో ఉన్న కాప్షన్ ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది.
‘ఈ సముద్రం మొత్తం అతను రక్తం తో రాసిన కథలతో నిండిపోయింది’ అంటూ ఊర మాస్ అనిపించే విధంగా ఈ కాన్సెప్ట్ పోస్టర్ ఉంది. ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ మాస్ ఇమేజి కి తగ్గట్టుగా ఉన్న టైటిల్ ని చూసి ఫ్యాన్స్ పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. కేవలం ఫస్ట్ లుక్ తోనే రోమాలు నిక్కపొడుచునేలా చేయబోతున్నారని ఈ కాన్సెప్ట్ పోస్టర్ ని చూస్తేనే అర్థం అయిపోతుంది.
'The sea is full of his stories 🌊…written in blood 🩸'#NTR30 first look on May 19th on the eve of @tarak9999's birthday ❤️🔥❤️🔥#KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/reqZOlcgxU
— NTR Arts (@NTRArtsOfficial) May 17, 2023