https://oktelugu.com/

Johnny Master : జానీ మాస్టర్ పై మరో వేటు..ఇక శాశ్వతంగా వాటి నుండి దూరం..జీవితం మొత్తం తలక్రిందులు అయిపోయిందిగా!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి అండాదండా లేకుండా ఒక గ్రూప్ డ్యాన్సర్ స్థాయి నుండి నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకొని, ఒక తెలుగోడిగా మన సత్తా చాటిన జానీ మాస్టర్ డౌన్ ఫాల్ గడిచిన ఆరు నెలల్లో ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం.

Written By: , Updated On : December 9, 2024 / 04:06 PM IST
Johnny Master

Johnny Master

Follow us on

Johnny Master : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి అండాదండా లేకుండా ఒక గ్రూప్ డ్యాన్సర్ స్థాయి నుండి నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకొని, ఒక తెలుగోడిగా మన సత్తా చాటిన జానీ మాస్టర్ డౌన్ ఫాల్ గడిచిన ఆరు నెలల్లో ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం. తన గ్రూప్ లో పని చేసిన శ్రేష్టి వర్మ అనే అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులు చేసాడని, తనని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడంటూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి విచారణ జరపడం. ఆ తర్వాత జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ మీద బయటకు రావడం వంటివి జరిగాయి. బెయిల్ మీద బయటకి అయితే వచ్చాడు కానీ, జానీ మాస్టర్ కి మునుపటి రేంజ్ లో అవకాశాలు దక్కడం లేదు. అదే విధంగా ఆయన గౌరవ మర్యాదలకు కూడా భంగం కలిగింది.

ఇప్పటికే ఆయన మీద పోక్సో చట్టం క్రింద కేసు నమోదు అవ్వడంతో ఆయనకి ప్రకటించిన నేషనల్ అవార్డుని కూడా జ్యురీ వెనక్కి తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాకుండా అరెస్ట్ కాకముందు జానీ మాస్టర్ డ్యాన్సర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉండేవాడు. కానీ ఆయన అరెస్ట్ అయ్యాక ఆ పదవి నుండి తప్పించేసాడు. ఇప్పుడు ఈ పదవి ఆదివారం నాడు ఎన్నిక జరగగా, జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. ప్రకాష్ కి ఇలా డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడం ఇది ఐదవ సారి. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే జానీ మాస్టర్ కి డ్యాన్సర్స్ అసోసియేషన్ నుండి మెంబెర్ షిప్ పూర్తిగా రద్దు చేసారు. ఇక ఎప్పటికీ ఆయన మెంబెర్ కాలేడు. ఆయన మీద వేసిన కేసులు కొట్టేసిన కూడా అధ్యక్షుడి ఇష్టం మీదనే జానీ మాస్టర్ కి మెంబెర్ షిప్ లభిస్తుంది.

ఎంతో మంది డ్యాన్సర్స్ కి మెంబెర్ షిప్ కార్డులు ఇప్పించి వాళ్ళ అభివృద్ధికి కారణమైన జానీ మాస్టర్ కి ఇలాంటి పరిస్థితి రావడం ఆయన అభిమానుల్ని తీవ్రమైన దుఃఖానికి గురి చేస్తుంది. ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిన జానీ మాస్టర్ జీవితం, ఇంత తక్కువ సమయంలో తలక్రిందులు అవుతుందని ఆయన శత్రువులు కూడా ఊహించి ఉండరు. మరోపక్క జానీ మాస్టర్ కి రాజకీయంగా కూడా తలుపులు తాత్కాలికంగా మూసివేయబడిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో జానీ మాస్టర్ జనసేన పార్టీ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాడు. పవన్ కళ్యాణ్ కూడా జానీ మాస్టర్ కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ అతనిపై ఈ అభియోగాలు రావడంతో పార్టీ నుండి సస్పెన్షన్ పడింది. కానీ జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చేందుకు నాగ బాబు చాలా వరకు సహాయం చేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుస గుసలు.