ఉత్తరాది నుండి వచ్చిన అందాల భామలు దక్షిణాది చిత్రపరిశ్రమను ఏలేస్తున్నారు. తమ అందాలతో నటనతో యిట్టె కట్టిపడేస్తున్నారు. అటువంటి కొంతమంది అందాల తరాల జాబితా ఇదే.. ‘నామ్ షబానా’, ‘పింక్’, ‘జుడ్వా 2’, ‘బద్లా’ తదితర చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటి తాప్సీ పన్నూ దక్షిణ భారతీయురాలు కాదు. ఆమె ఢిల్లీ నివాసి. 2014 లో ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి ఇలియానా డిక్రూజ్ హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించి పేరు సంపాదించింది. ఇలియానా గోవాకు చెందినది. కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తోంది. కానీ ఆమె బాలీవుడ్ లో హిట్ కొట్టలేక పోయింది. కాజల్ ముంబైకి చెందినది. ‘సింఘం’ చిత్రంలో అజయ్ దేవ్‌గన్ సరసన ఆమె బాలీవుడ్‌లో కనిపించింది.
బ్లాక్ బస్టర్ చిత్రం కోయి మిల్ గయలో చైల్డ్ రోల్ లో నటించిన నటి హన్సిక మోత్వానీ, ‘తేరా సూరూర్’ చిత్రంతో హీరోయినిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది, అయితే ఆ సినిమా ఫ్లాప్ తరువాత ఆమె సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. హన్సిక ముంబైకి చెందినది. ఇక పాపులర్ అండ్ హిట్ సీరియల్ అయిన ‘చిన్నారి పెళ్లి కూతురు’తో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన నటి అవికా గౌర్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన ఉనికిని చాటింది. అవికా కూడా ముంబైకి చెందినదే.
అలాగే ‘తేరే నామ్’ చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను అలరించిన నటి భూమికా చావ్లాకు సౌత్‌లో చాలా హిట్ చిత్రాలు పడ్డాయి. తర్వాత బాలీవుడ్‌లో అవకాశం దక్కింది. భూమిక దేశ రాజధాని ఢిల్లీ నుండి వచ్చింది.కాగా నటి నమ్రతా శిరోద్కర్ ‘వాస్తవ్’, ‘పుకార్’ తదితర బాలీవుడ్ చిత్రాలలో నటించింది. తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబును వివాహం చేసుకున్నారు. నమ్రత స్వస్థలం ముంబై. మెగాబ్లాక్‌బస్టర్ చిత్రం ‘బాహుబలి’ నటి తమన్నా భాటియాకు బాలీవుడ్‌లో మంచి పేరు వుంది. ఆమె అజయ్ దేవ్‌గన్‌తో హిమ్మత్‌వాలా, అక్షయ్ కుమార్‌తో కలిసి ఎంటర్టైన్మెంట్ తదితర బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. తమన్నా పంజాబ్ కు చెందినది.