
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వర్ దిల్ రాజు మేనల్లుడితో రోమాన్స్ చేసేందుకు రెడీ అయింది. దిల్ రాజు మేనల్లుడు అశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ కొత్తకుర్రాడికి జోడీగా అనుపమ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిల్ రాజు బ్యానర్లో వచ్చిన ‘శతమానంభవతి’ తెలుగులో అనుపమకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బీజీగా మారింది. తనకు అవకాశం ఇచ్చిన దిల్ రాజుపై కృతజ్ఞతతోనే అశిష్ రెడ్డి మూవీలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని ‘హుషారు’ మూవీ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్నాడు.
అనుపమ పరమేశ్వర్ ‘ప్రేమమ్’ మూవీతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. మళయాలంలో ‘ప్రేమమ్’ ఘనవిజయం సాధించింది. దీనికితోడు అనుపమ అందం, అభినయం యువతలో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. తెలుగులో అనుపమ తివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆఆ’ మూవీతో పరిచయమైంది. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దిల్‌రాజ్ నిర్మించిన ‘శతమానం భవతి’ మూవీతో మొయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ మూవీ భారీ విజయం అందుకోవడంతో తెలుగులో బీజీగా మారింది. ఆ తర్వాత… ఇదే బ్యానర్లో ‘హలో గురూ ప్రేమ కోసమే’ మూవీలో నటించింది. అయితే అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ మూవీలో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల బెల్లకొండ శ్రీనివాస్ కు జోడీగా ‘రాక్షసుడు’ మూవీలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం స్టార్ హీరోల పక్కన నటిస్తున్న దిల్ రాజు కోరిక మేరకే కొత్త కుర్రాడితో నటించేందుకు సిద్ధమైంది.