Pushpa movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోని తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఆర్య, ఆర్య 2 సినిమాలలోని ఐటమ్ సాంగ్స్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో మనకు తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలకు మించి పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించడం కోసం చిత్రబృందం బాలీవుడ్ బ్యూటీ నోరా ఫేతేహిని సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రత్యేక పాటలో నటించడానికి ఒప్పుకున్న ఈమె అందుకు తగ్గట్టుగానే పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.కేవలం ఐదు నిమిషాలు ఉండే ప్రత్యేక పాటలో నటించడం కోసం ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో చిత్ర బృందం ఒక్కసారిగా షాకయ్యారు. ఈమె రెండు కోట్లు డిమాండ్ చేసింది అంటేనే ఈమెకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థమవుతుంది.మరి ఈమె డిమాండ్ చేసిన పారితోషకం ముట్టజెప్పి సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం తీసుకుంటారా లేదా అనే విషయం చిత్రబృందం అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది.