Shankar – Maniratnam : శంకర్ – మణిరత్నం మధ్య మాటలు లేవా..? దానికి కారణం ఏంటి..?

ఇక ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం శంకర్ మణిరత్నం ఇద్దరూ చాలా బాగా మాట్లాడుకుంటారు. శంకర్ మణిరత్నం ను తన గురువు గా భావిస్తాడు..కాబట్టి వీళ్ళ మధ్య క్లాషేష్ రాలేదు, గొడవలు అసలే లేవు. ఎవరీ బిజీలో వాళ్ళు ఉండి మాట్లాడుకోవడం లేదేమో అంతే తప్ప వీళ్ళ మధ్య గొడవలు అయితే ఏమీ లేవు అంటూ క్లారిటీ ఇస్తున్నారు...

Written By: NARESH, Updated On : April 23, 2024 8:04 pm

shankar-and-mani-rathnam

Follow us on

Shankar – Maniratnam : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తమదైన మార్క్ చూపిస్తూ ఇండస్ట్రీలోనే ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు మణిరత్నం, శంకర్.. వీళ్ళు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో చాలావరకు సక్సెస్ అయ్యారు. అందువల్లే వీళ్లకు ఫెయిల్యూర్స్ కంటే సక్సెస్ లు ఎక్కువగా వచ్చాయి. ఇక అప్పట్లో శంకర్, మణిరత్నం లాంటి దర్శకులు తెలుగులో ఎందుకు లేరు అని మన వాళ్లు బాధపడేలా వాళ్ళు సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకునేవారు.

ఇక ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు సత్తా చాటుతూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియాలో అద్భుతాలను చేస్తున్న క్రమంలో ఈ సీనియర్ దర్శకులు కొంతవరకు వాళ్ల హవా ను తగ్గించారనే చెప్పాలి. ఇంకా ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే శంకర్, మణిరత్నం మధ్య కొన్ని రోజుల నుంచి మాటలు లేవనే వార్తలు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి వీళ్ళిద్దరి మధ్య మాటలు లేకపోవడానికి కారణం ఏంటి అసలు నిజంగానే వీళ్ళిద్దరి మధ్య మాటలు ఉన్నాయా లేవా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…శంకర్ రజనీకాంత్ తో రోబో సినిమా చేసినప్పుడు రజిని మణిరత్నం తో సినిమా చేయాల్సింది కానీ శంకర్ రోబో చేయడం తో రజినీ కాంత్ మణిరత్నం సినిమా క్యాన్సిల్ అయిందని, అలాగే వీళ్ళు కొన్ని సినిమాలను రిలీజ్ చేసే విషయంలో గానీ వీళ్ళ మధ్య కొన్ని క్లాషెష్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇక అందుకే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటివరకు మాట్లాడుకోకుండా ఉంటున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. నిజానికి ఈ లెజెండరీ డైరెక్టర్లు ఇద్దరి వల్లే తమిళ్ సినిమా ఇండస్ట్రీ అనేది టాప్ లోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. మరి ఇద్దరు డైరెక్టర్ల మధ్య మాటలు లేకపోవడం వల్ల వాళ్ళ అభిమానులు కూడా కొంతవరకు నిరాశ కు గురైవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం శంకర్ మణిరత్నం ఇద్దరూ చాలా బాగా మాట్లాడుకుంటారు. శంకర్ మణిరత్నం ను తన గురువు గా భావిస్తాడు..కాబట్టి వీళ్ళ మధ్య క్లాషేష్ రాలేదు, గొడవలు అసలే లేవు. ఎవరీ బిజీలో వాళ్ళు ఉండి మాట్లాడుకోవడం లేదేమో అంతే తప్ప వీళ్ళ మధ్య గొడవలు అయితే ఏమీ లేవు అంటూ క్లారిటీ ఇస్తున్నారు…