Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… ఇప్పుడు కేవలం తెలుగు స్టార్ హీరో మాత్రమే కాదు… ఆయన ఇంటర్నేషనల్ స్టార్. బాహుబలి తర్వాత ఆయన నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా లేవల్ లో మాత్రమే కాకుండా … అంతర్జాతీయంగా మంచి గుర్తింపును సాధిస్తున్నాయి. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని… 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరోవైపు ప్రభాస్.. సలార్, ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ … అలానే సందీప్ రెడ్డి వంగాతో ” స్పిరిట్ ” అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నెల 23 వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సంధర్భంగా ఆయా చిత్రాలకు సంబంధించి అప్డేట్ ల కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ అభిమానులకు బాడ్ న్యూస్ చెబుతున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు నాగ్ అశ్విన్ సమాధానం ఇచ్చాడు. ఆ ట్వీట్ లో ఏముందంటే … ప్రభాస్ బర్త్ డే కి అప్డేట్ ఏం లేదా అని అడగ్గా … ఆఫ్టర్ రాధే శ్యామ్ అని నాగ్ అశ్విన్ బదులిచ్చాడు. దీంతో వీరి కాంబో లో వస్తున్న చిత్రానికి గాను ఏ అప్డేట్ లేదని ప్రభాస్ అభిమానులు ఫీల్ అవుతున్నారు.

ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తుండగా… 500 కోట్లు బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను తీసుకున్నారు. సైన్స్, ఫిక్షన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుండగా … ఈ సినిమాకు ప్రాజెక్ట్ కే అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.