Bheemla Nayak Record: మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..హిట్స్ మరియు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ మోత మోగించే ఏకైక హీరో అని అందరూ అంటూ ఉంటారు..ఒక్క పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాకి ఉండే మేనియా మరియు క్రేజ్ పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాకి ఉంటుంది అనే దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి..పింక్ లాంటి ఒక్క సబ్జెక్టు ని ఏ హీరో అయినా రీమేక్ చేస్తే మినిమం ఓపెనింగ్స్ కూడా రావు అనేది అక్షర సత్యం..కానీ అదే సినిమాని పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే పేరు తో రీమేక్ చేస్తే కరోనా పీక్ టైం లో కూడా అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లను రాబట్టిన సినిమాగా ఇప్పటికి టాప్ 5 లో ఉన్నది..ఈ సినిమా ట్రైలర్ దగ్గర నుండి టీవీ టెలికాస్ట్ వరుకు అభిమానులు చేసిన హుంగామ మరియు రచ్చ ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు.

ఈ సినిమా తర్వాత విడుదల అయినా మరో పవన్ కళ్యాణ్ రీమేక్ మూవీ భీమ్లా నాయక్ సినిమా అయితే అమెరికా నుండి అనకాపల్లి వరుకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని దక్కించుకుంది..ఆంధ్ర ప్రదేశ్ టికెట్ రేట్స్ మరియు అదనపు షోస్ లెకపొయ్యినప్పటికీ ఈ సినిమాకి అమ్ముడుపోయిన టిక్కెట్ల సంఖ్య బాహుబలి కంటే ఎక్కువ ఉంటుంది అని అంచనా..కేవలం బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రమే కాదు..ఆన్లైన్ లో కూడా ఈ సినిమా సృష్టించిన కొన్ని అరుదైన రికార్డులను #RRR మరియు ఆచార్య వంటి మల్టీస్టార్ర్ర్ సినిమాలు కూడా బ్రేక్ చేయలేకపోయాయి అంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు..ఇక అసలు విషయానికి వస్తే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని యూట్యూబ్ లో కేవలం సింగిల్ ఛానల్ లోనే దాదాపుగా 1 లక్షా 86 వేల మంది వీక్షించారు..ఇక అన్ని చానెల్స్ కి కలిపి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 5 లక్షల 45 వేల మంది చూసారు.
ఈ రికార్డు ని రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టార్ర్ర్ #RRR కూడా బ్రేక్ చెయ్యలేకపోయింది..ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కేవలం ఒక్క ఛానల్ లోనే 1 లక్ష 54 వేల మంది వీక్షించగా..అన్ని చానెల్స్ కి కలిపి 4 లక్షల 84 వేల మంది లైవ్ గా చూసారు..భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత టాప్ 2 లో నిలిచినా మూవీ ఇదే..ఇక భీమ్లా రికార్డు ని మరో బిగ్గెస్ట్ మల్టీస్టార్ర్ర్ మూవీ ఆచార్య బ్రేక్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు..కానీ ఈ సినిమా భీమ్లా నాయక్ రికార్డు కి దగ్గరలో కూడా రాలేకపోయింది..సింగల్ ఛానల్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేవలం 45 వేల మంది మాత్రమే లైవ్ గా చూసారు..ఇక అన్ని చానెల్స్ కలిపి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేవలం ఒక్క లక్ష 30 వేల మంది మాత్రమే లైవ్ గా చూసారు..భీమ్లా నాయక్ సింగల్ ఛానల్ రికార్డుని, ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్ని చానెల్స్ కలిపి కూడా బ్రేక్ చెయ్యలేకపోయింది..మరి భీమ్లా సృష్టించిన ఈ అరుదైన రికార్డుని మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అయినా బ్రేక్ చేస్తుందా..లేకపోతే భీమ్లా రికార్డు బ్రేక్ అవ్వడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమానే దిగి రావాలా అనేది చూడాలి.