https://oktelugu.com/

Senior Heroine Tabu: అడుక్కోవాల్సిన అవసరం లేదు.. సీనియర్ భామ ఘాటు వ్యాఖ్యలు

Senior Heroine Tabu: టబు.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌ గా తన హవా చూపించింది. టబు తన అందం, నటనతోనే కాదు తన కళ్లతోనూ తెలుగు ప్రేక్షలను ఫిదా చేసింది. టబు తెలుగులో ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించింది. హిందీలో కూడా టబుకి పలు హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ మధ్య టబు తన సినిమాల వేగం పెంచింది. అతిథి పాత్రలోనూ ఆమె కనిపించడానికి ఉత్సాహం చూపిస్తుంది. అయితే.. […]

Written By:
  • Shiva
  • , Updated On : July 1, 2022 / 05:32 PM IST
    Follow us on

    Senior Heroine Tabu: టబు.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌ గా తన హవా చూపించింది. టబు తన అందం, నటనతోనే కాదు తన కళ్లతోనూ తెలుగు ప్రేక్షలను ఫిదా చేసింది. టబు తెలుగులో ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించింది. హిందీలో కూడా టబుకి పలు హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ మధ్య టబు తన సినిమాల వేగం పెంచింది. అతిథి పాత్రలోనూ ఆమె కనిపించడానికి ఉత్సాహం చూపిస్తుంది.

    Senior Heroine Tabu

    అయితే.. గత కొన్ని రోజులుగా టబు గురించి ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. టబుకి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని.. ఆమె అందుకే బోల్డ్ పాత్రాల్లో నటిస్తోంది అంటూ కొత్తగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం చివరకు టబు వరకూ చేరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టబు ఈ విషయాలపై స్పందించారు.

    Also Read: Payal Rajput: ఆ విషయంలో తగ్గేదే లే అంటున్న పాయల్ రాజ్ పుత్ !.

    టబు మాటల్లోనే.. ‘నేను ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నానని, అందుకే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానంటూ నా పై పుకార్లు పుట్టిస్తున్నారు. ఈ పుకార్లను నేను కొట్టిపారేస్తున్నాను. వీటిల్లో అసలు వాస్తవం లేదు. నేను ఆర్థికంగా బాగున్నాను. నాకు ఆఫర్స్‌ కావాలని అడుక్కోవాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు. రాదు కూడా’ అంటూ టబు క్లారిటీ ఇచ్చింది.

    ఇంతకీ టబు పై ఈ వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయి అంటే.. ఆమె సినిమాల్లో తన పరిధి దాటుతుంది అని, ఈ వయసులో ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తోంది ? అంటూ చర్చ మొదలు పెట్టారు నెటిజన్లు. ఈ క్రమంలోనే టబు తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆఫర్స్‌ కావాలంటూ దర్శక-నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తోంది అని రూమర్స్ పుట్టించారు.

    Senior Heroine Tabu

    ఈ విషయం పై టబు ఇంకా మాట్లాడుతూ… ‘నాకు డబ్బు సమస్య ఉందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను టబు. నేను ఎప్పుడు ఆర్థికంగా బాగానే ఉంటాను. ఇక నేను ఎవర్నీ నాకు ఆఫర్స్‌ ఇవ్వండి అని అడుక్కోలేదు. అలాగే, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30లో నేను నటిస్తున్నాను అని వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు’ అని టబు చెప్పుకొచ్చింది.

    Also Read:Sammathame Collections: ‘సమ్మతమే’ 7 డేస్ కలెక్షన్స్.. ఇంకెన్ని కోట్లు రావాలంటే ?

    Tags