No Hard Feelings: ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఎంట్రీతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ముఖ చిత్రం మారిపోయింది. డిజిటల్ కంటెంట్ కి ఆడియన్స్ అలవాటు పడ్డారు. లెక్కకు మించిన సినిమాలు, సిరీస్లు అందుబాటులో ఉంటున్నాయి. విభిన్నమైన కంటెంట్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సినిమాలు, సిరీస్లు వివిధ ఫ్లాట్ ఫార్మ్స్ లో అలరిస్తున్నాయి. మూవీ లవర్స్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పై మక్కువ పెంచుకుంటున్నారు.
ఒకప్పుడు పట్టణ ప్రాంతాల ఆడియన్స్ మాత్రమే డిజిటల్ సిరీస్లలో సినిమాలు చూసేవారు. ఈ కల్చర్ పల్లెలకు కూడా పాకింది. చక్కగా ఇంట్లో కూర్చుని కుటుంబ సభ్యులు సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. పెరిగిన టికెట్స్ ధరలు కూడా ఓటీటీల వైపు ప్రేక్షకులు అడుగులు వేసేలా చేస్తున్నాయి. ముఖ్యంగా లెక్కకు మించిన సినిమాలు, సిరీస్లు నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తున్నాయి.
కాగా ఓటీటీలో ఓ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో 19 ఏళ్ల అబ్బాయికి ఓ 30 ఏళ్ల అమ్మాయి రొమాన్స్ నేర్పడం అనేది హైలెట్ పాయింట్. బోల్డ్ కంటెంట్ తో సాగే ఈ మూవీ పేరు నో హార్డ్ ఫీలింగ్స్. 2003లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. కేవలం $40 మిలియన్ తో నిర్మించారు. $ 87 మిలియన్స్ వరకు వసూలు చేసింది.
నో హార్డ్ ఫీలింగ్స్ చిత్రానికి జీన్ స్టప్నీస్కై దర్శకత్వం వహించారు. జెన్నిఫర్ లారెన్స్, ఆండ్ర్యూ బర్త్ హీరో హీరోయిన్స్ గా నటించారు. అనేక అవార్డులు సొంతం చేసుకుంది. నో హార్డ్ ఫీలింగ్స్ మూవీని నెట్ఫ్లిక్స్, సోనీ లివ్ లో చూసి ఎంజాయ్ చేయండి.
నో హార్డ్ ఫీలింగ్స్ మూవీ కథ విషయానికి వస్తే.. ధనవంతుల కుటుంబంలో పుట్టిన 19 ఏళ్ల కుర్రాడు మనుషులకు, సమాజానికి దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. అతడికి స్నేహితులు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉండరు. కొడుకు ప్రవర్తనతో పేరెంట్స్ ఆందోళన చెందుతారు. కొడుకును ఎలాగైనా మార్చాలని ఒక ప్లాన్ వేస్తారు. ఓ 30 ఏళ్ల అందమైన అమ్మాయికి డబ్బులు ఇచ్చి, తన కొడుకును ప్రేమలో దించాలని చెప్పి పంపిస్తారు.
ఆ అందమైన యువతి యువకుడితో పరిచయం పెంచుకుంటుంది. అనుకోకుండానే ఆ కుర్రాడు ఆమె ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య రొమాన్స్ చోటు చేసుకుంది. అయితే ఆమె డబ్బుల కోసం తనతో ప్రేమను నటిస్తున్న విషయం ఆ కుర్రాడికి తెలుస్తుంది. అప్పుడు ఆ కుర్రాడు ఏం చేశాడు? ఆ యువతితో అతడి ప్రయాణం ఎలా సాగింది? అనేది కథ..