Chammak Chandra: భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా జబర్దస్ కామెడీయన్లు బయటికి వెళ్లి తిరిగి తిరిగి ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ షో తొలినాళ్లలో విజయవంతం కావడానికి ధనధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, వేణు, చలాకీ చంటి, అదిరే అభి తదితరుల కృషి ఎంతో ఉంది. బుల్లితెరపై ఈ కార్యక్రమానికి విపరీతమైన టీఆర్పీ రావడంతో మల్లెమాల ప్రొడక్షన్స్ కు కాసులవర్షం కురిసింది.
ఏడాదికేడాది ఈ షో రేటింగ్ పెరుగుతూ పోయింది. దీంతో కామెడీయన్స్ సైతం రెమ్యూనరేషన్ బాగానే దక్కింది. ఈ షోను నాగబాబు, రోజాలు జడ్జిలుగా ముందుండి నడిపించడగా యాంకర్లు అనసూయ, రేష్మిలు గ్లామర్ తీసుకొచ్చారు. ఈ షో ద్వారా జబర్దస్త్ కామెడీయన్లకు టాలీవుడ్లో మంచి ఆఫర్లు రావడంతో కొంతమంది ఈ షోకు గుడ్ బై చెప్పగా మరికొంతమది మేనేజ్మెంట్ తీరు నచ్చక వెళ్లిపోయారు.
జబర్దస్త్ కార్యక్రమాన్ని అన్నివిధలా ముందుండి నడిపించిన మెగా బ్రదర్ నాగబాబు ఈ షోను వెళ్లిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆయనతోపాటే జబర్దస్త్ లోని టాప్ కామెడీయన్లు, టెక్నిషియన్లు వెళ్లిపోయారు. అయితే చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో ఆ షోకు మైనస్ గా మారింది.
చమ్మక్ చంద్రకు ప్లేసులో ఎంతమంది కామెడీయన్లను ట్రై చేసినా ఆయనలా ఫ్యామిలీ స్కిట్స్ చేసేవాళ్లు జబర్దస్త్ కు లభించడం లేదు. దీంతో ఆలోటు ఇప్పటికీ జబర్దస్త్ లో అలాగే ఉంది. మరోవైపు నాగబాబు ఆధ్వర్యంలో జబర్దస్త్ కు పోటీగా జీ తెలుగులో ‘బొమ్మ అదిరింది’ అనే కామెడీ షో ప్రారంభమైంది. ఇందులో చమ్మక్ చంద్ర, ఆర్పీ, చలాకీ చంటి కామెడీయన్లు స్కిట్స్ చేశారు.
అయితే ఈ షో అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో కొన్నినెల్లల్లో ఈ షోకు జీ యాజమాన్యం ప్యాకప్ చెప్పింది. దీంతో కొంతమంది జబర్దస్త్ బాట పట్టారు. మరికొంత మంది ‘మా’లో ప్రసారం అవుతున్న ‘కామెడీ స్టార్స్’ అనే కార్యక్రమంలో స్కిట్స్ చేస్తున్నాయి. ఈ షోలో చంద్రకు రెమ్యూనరేషన్ బాగానే వస్తున్నప్పటికీ ఈ షోకు గ్యారంటీ లేకుండా పోయింది. దీంతో చంద్ర మళ్లీ జబర్దస్త్ వైపు చూస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.
జబర్దస్త్ ఫ్యాన్స్ మాత్రం చంద్ర ఈ షోకు తిరిగి రావాలని కోరుతున్నారు. అయితే ‘మల్లెమాల’ మాత్రం చంద్రకు నో ఎంట్రీ బోర్డు పెట్టిందని తెలుస్తోంది. కాగా ఈ మధ్యే చంటి సైతం జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో చంద్ర కూడా వచ్చే అవకాశం కన్పిస్తోంది. అయితే నాగబాబుకు చంద్ర హ్యండిచ్చి జబర్దస్త్ లో మళ్లీ చేరుతారా? లేదా అనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.