https://oktelugu.com/

Nivetha Pethuraj: కార్తికేయతో జతకట్టనున్న నివేదా పేతురాజ్…

Nivetha Pethuraj: మెంటల్‌ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు ఎంటట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్‌ కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే  క్రేజ్‌ సంపాదించుకుంది. తెలుగులో చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురంలో చిత్రాలలో తన నటనకు తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నారు నివేదా పేతురాజ్‌. సోషల్ మీడియా లోనూ యాక్టివ్  గా ఉండే  ఈ భామ అప్పుడప్పుడు తన […]

Written By: , Updated On : October 23, 2021 / 04:19 PM IST
Follow us on

Nivetha Pethuraj: మెంటల్‌ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు ఎంటట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్‌ కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే  క్రేజ్‌ సంపాదించుకుంది. తెలుగులో చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురంలో చిత్రాలలో తన నటనకు తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నారు నివేదా పేతురాజ్‌. సోషల్ మీడియా లోనూ యాక్టివ్  గా ఉండే  ఈ భామ అప్పుడప్పుడు తన ఫోటోలతో యువకుల హృదయాలను దోచుకుంటూ ఉంటుంది.

nivetha-pethuraj-going to act with young hero karthikeya

ఓ  వైపు నటనా ప్రాధాన్యపాత్రలు ఎంచుకుంటూనే మరోవైపు కమర్షియల్‌ నాయిక గానూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది నటి నివేదా. ఈ ఏడాది ‘రెడ్‌’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ భామ. ఇటీవలే విడుదలైన పాగల్‌ సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రంలో హీరోగా విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్‌ నటించారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నివేదా పేతురాజ్‌.  కాగా యంగ్ హీరో కార్తికేయ సరసన ఒక సినిమాకు ఈ ముద్దుగుమ్మ ఒకే చెప్పినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం కార్తికేయ హీరోగా ‘రాజా విక్రమార్క’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.  ‘రాజా విక్రమార్క’ పూర్తయిన వెంటనే ఓ కొత్త దర్శకుడితో ఒక సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో నటించేందుకే  నివేదా ను ఒకే చేసినట్లు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా  మారాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి  వివరాలు త్వరలోనే వెల్లడిస్తారట.