
స్టన్నింగ్ బ్యూటీ నివేదా పేతురాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కోలివుడ్ మూవీలతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ భామ ప్రస్తుతం వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమా ఛాన్సులు దక్కించుకుని సౌత్ భామ మారుతోంది. ప్రస్తుతం ప్యాన్ ఇండియా, భారీ బడ్జెట్ మూవీల హవా నడుస్తుండటంతో సౌత్, బాలీవుడ్ భామలకు ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉంది. సౌత్ క్వీన్ గా నయనతార, అనుష్క వంటి తారలు కొనసాగుతున్నారు. సీనియర్ నటి త్రిష, కాజల్ అగర్వాల్, సమంత, శృతిహాసన్ వంటి కొందరు తారలు మాత్రమే సౌత్ భామలుగా రాణిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే కొందరు యంగ్ హీరోయిన్లు సౌత్ భామలుగా మారుతోన్నారు. ఐశ్వర్య రాజేష్, మళవికాశర్మ, ప్రియావారియర్ పేర్లు సౌత్ ఇండస్ట్రీలో తరుచూ విన్పిస్తున్నాయి. తాజాగా ఆ లిస్టులో నివేధా పేతురాజ్ చేరింది. నివేదా పేతురాజ్ తెలుగులో ‘బోచేవారెవరూ’, ‘చిత్రలహారి’, ‘అలవైకుంఠపురములో’ సినిమాల్లో నటించింది. లీడ్ హీరోయిన్ గా కాకపోయినప్పటికీ ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘రెడ్’, సాయిధరమ్ తేజ్-దేవాకట్టా మూవీలో ఆఫర్లు దక్కించుకుంది.
ఈ భామ కెరీర్ తొలినాళ్లలో కోలివుడ్ సినిమాల్లో నటించింది. దీంతో ప్రస్తుతం కోలివుడ్ నుంచి వరుస ఆఫర్లు వస్తుండటంతో అక్కడ బీజీగా స్టార్ గా మారిపోయింది. అదేవిధంగా తమిళం నుంచి మంచి ఆఫర్లు దక్కుతున్నాయి. ఇటీవలే ఈ భామ ఓ మలయాళ మూవీకి సైన్ చేసింది. దుల్కర్ సల్మాన్ పక్కన నివేధా పేతురాజ్ నటించనుంది. లాక్డౌన్ తర్వాత ఈ భామకు మరిన్ని అవకాశాలు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ భామ నటించే చిత్రాలు హిట్టయినట్లయితే త్వరలో సౌత్ స్టార్ గా ఎదగడం ఖాయంగా కన్పిస్తుంది.