
యంగ్ హీరో నితిన్ జోరు మీద ఉన్నాడు. ఇటీవల తీసిన ‘చెక్’ మూవీ ఫ్లాప్ అయినా వెంటనే ‘రంగ్ దే మూవీ’ రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. అది మరిచిపోకముందే అంధుడిగా ‘మాస్ట్రో’ అనే విలక్షణ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఆ ట్రైలర్ ఆకట్టుకుంది.
‘ఆంధాదూన్’ రిమేక్ గా వస్తున్న ‘మాస్ట్రో’ సినిమా క్రైం హర్రర్ లా కనిపిస్తోంది. ఈ సినిమా నడుస్తుండగానే మరో సినిమా పట్టాలెక్కించాడు నితిన్. తాజాగా ‘నా పేరు సూర్య’తో ఫ్లాప్ కొట్టిన స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో రెండో సినిమాకు ఓకే చెప్పేశాడట..
ఇటీవల వంశీ తీసుకొచ్చిన సబ్జెక్ట్ నచ్చడంతో వెంటనే ఆయన దర్శకత్వంలోనే రెండో సినిమా తీయడానికి నితిన్ ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాను టాగోర్ మధు నిర్మిస్తున్నారు.
ఇక గతంలో నితిన్ తో కలిసి సినిమా తీయాలనుకున్న ‘చల్ మోహనరంగా’ దర్శకుడు కృష్ణ చైతన్య మూవీని నితిన్ పక్కనపెట్టినట్టు సమాచారం. వీరిద్దరూ కలిసి ‘పవర్ పేట’ అనే సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకున్నారు. అయితే కథ, కథనంపై పూర్తి నమ్మకం లేని నితిన్ ఆ సినిమాను పూర్తి పక్కనపెట్టి ఇప్పుడు వక్కంతం వంశీ చిత్రంతోనే ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యాడట..