https://oktelugu.com/

Skylab OTT: ఓటీటీలో నిత్యా మీనన్ ‘స్కైలాబ్’.. అధికారిక డేట్ వచ్చేసింది..!

Skylab in OTT : మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ ‘స్కైలాబ్’ మూవీతో నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెల్సిందే. ‘స్కైలాబ్’ కథ విన్న వెంటనే తనకు బాగా నచ్చడంతో ఈ మూవీలో నటించేందుకు నిత్యామీనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దర్శకుడు విశ్వక్ కందెరావ్ ఈ మూవీ కథను అద్భుతంగా తెరకెక్కించాడు. ‘స్కైలాబ్’ మూవీలో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 1979లో జరిగిన ‘స్కైలాబ్’ సంఘటనలను కళ్ళకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. తెలంగాణలోని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 12, 2022 / 09:42 AM IST
    Follow us on

    Skylab in OTT : మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ ‘స్కైలాబ్’ మూవీతో నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెల్సిందే. ‘స్కైలాబ్’ కథ విన్న వెంటనే తనకు బాగా నచ్చడంతో ఈ మూవీలో నటించేందుకు నిత్యామీనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దర్శకుడు విశ్వక్ కందెరావ్ ఈ మూవీ కథను అద్భుతంగా తెరకెక్కించాడు.

    Skylab Telugu Movie

    ‘స్కైలాబ్’ మూవీలో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 1979లో జరిగిన ‘స్కైలాబ్’ సంఘటనలను కళ్ళకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. తెలంగాణలోని బండలింగంపల్లి గ్రామంలో జరిగిన సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ఈ మూవీని దర్శకుడు విశ్వక్ తెరకెక్కించారు.

    నాటి సీరియస్ ఇష్యూకు దర్శకుడు కొంత ఎంటటైన్మెంట్ జోడించి ఈ మూవీని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలు తమ నటనతో ఆకట్టుకుున్నారు. డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయింది. జనవరి 14న ప్రముఖ ఓటీటీ సోనీ లివలో ‘స్కైలాబ్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని Sony LIv ట్వీటర్లో వెల్లడించింది.

    ఈ మూవీని డాక్టర్ రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ బ్యానర్లపై పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. తన తొలి మూవీతోనే దర్శకుడు విశ్వక్ కందెరావ్ విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నాడు. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోననే ఆసక్తి నెలకొంది.